BigTV English

NBA Match:వామ్మో.. ఆ మ్యాచ్ ఒక్క టిక్కెట్ ధర రూ.75 లక్షలా?

NBA Match:వామ్మో.. ఆ మ్యాచ్ ఒక్క టిక్కెట్ ధర రూ.75 లక్షలా?

NBA Match:సాధారణంగా క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉంటాయి. అదే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో మ్యాచ్‌ల టికెట్ల ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చమో. కానీ, ఒక మ్యాచ్ టికెట్ ధర ఏకంగా లక్షల రూపాయలు పలుకుతోందని మీకు తెలుసా? అది కూడా బాస్కెట్‌ బాల్‌ మ్యాచ్ టికెట్ ధర ఆ రేంజ్‌లో ఉందంటే నమ్మకం కలగడం లేదు కదూ. కానీ ఇదే నిజం. ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ టికెట్ ఒక్కోటీ ఏకంగా రూ.75 లక్షలకు అమ్ముడవుతోంది.


అమెరికాలో బాస్కెట్ బాల్ బాగా ఫేమస్. ఈ గేమ్‌ బాగా ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు… లెబ్రాన్‌ జేమ్స్‌. నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ లీగ్‌లో అతనికున్న క్రేజే వేరు. ఇప్పుడు లెబ్రాన్‌ జేమ్స్‌ ఎన్‌బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్ రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. 40 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును అతను బద్దలు కొడతాడనే అంచనాలు ఉండటంతో… ఎన్‌బీఏ లీగ్‌కు అమాంతం క్రేజ్‌పెరిగిపోయింది. అతని ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు… అభిమానులు ఎంత డబ్బయినా పోసి టికెట్లు కొనేందుకు వెనుకాడటం లేదు. లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఓక్లహామా సిటీ థండర్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు… రికార్డు ధర పలికాయి. ఒక్కో టికెట్ 92 వేల డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు రూ.75 లక్షలకు అమ్ముడుపోతోంది. లాస్ ఏంజిల్స్ లేకర్స్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుండటంతో… ఏదో ఒక దాంట్లో లెబ్రాన్ జేమ్స్ కొత్త రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అందుకే… అతను ఆడే మ్యాచ్ టికెట్ ధర ఏకంగా రూ.75 లక్షలు పలుకుతోంది. లేకర్స్, థండర్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్ ధర సగటను 1152 డాలర్లు.. అంటే రూ.94 వేలుగా ఉంది. ఇక లేకర్స్, బక్స్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్ సగటు ధర 1302 డాలర్లు… అంటే రూ.1 లక్షగా ఉంది.
ఎన్‌బీఏలో ఆల్ టైమ్ రికార్డు 38,387 పాయింట్లుగా ఉంది. ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు లెబ్రాన్ జేమ్స్ 38,325 పాయింట్లతో… ఆ రికార్డుకు చాలా చేరువగా ఉన్నాడు. 2003-04 సీజన్లో అరంగేట్రం చేసిన జేమ్స్… తొలి సీజన్ మినహా… ప్రతి సీజన్లోనూ ఒక్కో మ్యాచ్‌కు సగటున 25 పాయింట్లు స్కోరు చేస్తున్నాడు. ఈ లెక్కన తాజాగా జరిగే నాలుగు మ్యాచ్‌ల్లో వంద పాయింట్లు చేస్తే… ఎన్‌బీఏలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×