E-Paper

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌
Advertisement

Women’s T20 World Cup 2026 : టి20 మహిళల ప్రపంచక 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ జూన్ 12వ తేదీన ప్రారంభం కాగా జూలై 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. ఈ సారి నెద‌ర్లాండ్స్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు కూడా వరల్డ్ కప్ అర్హత సాధించింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ ఆడుతోంది నెదర్లాండ్స్. అయితే ఈ క్రమంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు మహిళా క్రికెటర్లు. లీడ్స్ వేదిక‌గా మంగ‌ళ వారం వర్షం పడగా… నెదర్లాండ్ క్రికెటర్లు చిన్నపిల్లల్లాగా చిల్ అయ్యారు. స్టేడియంలో వర్షం పడుతుండగా ఎంజాయ్ చేశారు. 26 సంవత్సరాల తర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్నామ‌న్న సంతోషంలో వ‌ర్షంలోనూ ఎగిరి గంతేశారు.

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్ Ind vs Pak Women’s T20 World Cup 2026

వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌…ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026) భాగంగా 26 సంవత్సరాల తర్వాత అర్హత సాధించిన నెదర్లాండ్స్.. తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన నెదర్లాండ్స్ ఓటమిపాలైంది. అయితే, నెదర్లాండ్స్ వర్సెస్ టీమిండియా మహిళల జట్ల (India Women vs Netherlands Women, 10th Match) మధ్య లీడ్స్ ( Headingley, Leeds ) వేదికగా బుధవారం మ్యాచ్ జరగనుంది. అంటే జూన్ 17వ తేదీన ఈ రెండు జట్ల మధ్య రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఉంటుంది. అయితే, మంగ‌ళ‌వారం నెద‌ర్లాండ్స్ ప్లేయ‌ర్లు ప్రాక్టీస్ చేస్తుండ‌గా లీడ్స్ వేదిక‌గా, వ‌ర్షం ప‌డింది. ఈ క్ర‌మంలో నెదర్లాండ్ క్రికెటర్లు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశారు. స్టేడియంలో వర్షం పడుతుండగా ఎగిరి గంతేశారు. 26 సంవత్సరాల తర్వాత వ‌రల్డ్ క‌ప్ ఛాన్స్ వ‌చ్చినందుకు గానూ ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. ప్రపంచ కప్ లోకి ఎంట్రీ

2000 సంవత్సరంలో ప్రపంచకప్ ఆడిన నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్టు .. 26 సంవత్సరాల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. నేపాల్ లో జరిగిన క్వాలిఫైయర్ టోర్నమెంట్లో అమెరికా, ఐర్లాండ్ అలాగే బంగ్లాదేశ్ లాంటి జట్లతో పోరాడి మరి… వరల్డ్ కప్ (ICC Women’s T20 World Cup 2026) అర్హత సాధించింది. యువ క్రికెటర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి.. జట్టు పరువును నిలబెట్టుకున్నారు. ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్నారు.

Advertisement

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

 

 

Related News

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు WPLలో ఛాన్స్ ఇవ్వండి..అప్పుడే టీమిండియా భ‌ర‌తం ప‌డ‌తారు

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

మైదానంలో కాల‌ర్ ప‌ట్టుకున్నాడు…బ‌య‌ట కాళ్లు మొక్కాడు, వీడు మామూలోడు కాదురా

ఇది మీ ఐపీఎల్ కాదమ్మా..ఎక్కువ చేస్తే లంక‌లోనే పాత‌రేస్తారు, వైభ‌వ్ కు త‌న్వీర్ వార్నింగ్

×