E-Paper
Advertisement

పని చేసిన బ్యాంకులోనే దోపిడీ… మైండ్ బ్లోయింగ్ మనీ హీస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

పని చేసిన బ్యాంకులోనే దోపిడీ… మైండ్ బ్లోయింగ్ మనీ హీస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Financial Crime Thriller : క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు ఓటీటీలో ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అయితే అందులోనూ ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్లు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి, వీటిని హీస్ట్ థ్రిల్లర్లు అని కూడా పిలుచుకోవచ్చు. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు హీస్ట్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. 2024 నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మూవీ లవర్స్ ను అలరించిన తెలుగు ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ‘జీబ్రా’ (Zebra). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, సునీల్ తదితరులు నటించారు. బ్యాంకింగ్ లూప్‌హోల్స్, వైట్ కాలర్ క్రైమ్స్, ఊహించని ట్విస్టులు, టర్నులు, యాక్షన్ కలిసిన ఈ చిత్రం ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

సూర్య (సత్యదేవ్) ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేసే తెలివైన ఉద్యోగి. అతని గర్ల్‌ఫ్రెండ్ స్వాతి (ప్రియ భవాని శంకర్) బ్యాంకులో జరిగిన ఒక పెద్ద తప్పును సరిదిద్దాల్సి వస్తుంది. ఆ క్రమంలో సూర్య బ్యాంకింగ్ సిస్టమ్‌ లోని లోపాలను కనిపెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. క్లెయిమ్ లేని ఖాతాలు, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలు వంటివి వాడుకుని కోట్లు ఫ్రాడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ ఫ్రాడ్ వల్ల ఊహించని విధంగా ఆది (డాలీ ధనంజయ) అనే ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ కమ్ బిజినెస్ మేగ్నెట్‌ కు భారీ నష్టం వాటిల్లుతుంది. తన డబ్బు పోగొట్టుకున్న ఆది రగిలిపోయి, సూర్యను పట్టుకుని తన సొమ్మును తిరిగి పొందడానికి ఒక డెడ్లీ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తాడు.

Advertisement

ఈ కథలో గుప్తా (సునీల్), వాసుదేవ్ (సత్యరాజ్) వంటి క్రిమినల్ పాత్రలు కూడా ఎంట్రీ ఇచ్చి కథను మరింత క్లిష్టంగా, ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఒక సాదాసీదా బ్యాంక్ ఉద్యోగి తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి, శక్తిమంతమైన మాఫియా నుంచి తప్పించుకోవడానికి ఎలా పోరాడతాడు ? అనేదే ఈ సినిమా ముఖ్యాంశం.

ఎందుకు చూడాలి?

బ్యాంకింగ్ సిస్టమ్ లోపాలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్, మైండ్ గేమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కావాలనుకుంటే ‘జీబ్రా’ సినిమాను చూడాల్సిందే. సాధారణ ఉద్యోగి ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఎదుర్కొని ఎలా పోరాడతాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కథను చక్కగా నడిపించి, ట్విస్ట్‌లతో నింపాడు. సత్యదేవ్ సూర్య పాత్రలో తెలివైన, ధైర్యవంతుడైన యువకుడిగా బాగా నటించాడు. డాలీ ధనంజయ ఆది పాత్రలో భయపెట్టే గ్యాంగ్‌స్టర్ అవతారంలో తనదైన స్టైల్‌లో మెరిశాడు. ప్రియ భవాని శంకర్ గర్ల్‌ఫ్రెండ్ స్వాతిగా ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. సత్యరాజ్, సునీల్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు బలం చేకూర్చారు.

Advertisement

Read Also : బ్రూటల్ మర్డర్స్… కలియుగాన్ని స్థాపిస్తానని మంకు పట్టు… ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వొద్దు

Tags

Related News

ఓటీటీలోకి రాబోతున్న ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘కాక్ టెయిల్ 2’ మూవీ!

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ మూవీస్..ఆ రెండు మస్ట్ వాచ్..

1775 నుంచి 2050 వరకు వెంటాడిన శాపం… ఓటీటీలో ఈ హారర్ మూవీ చూశారా?

గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?

నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్

దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

Big Stories

Advertisement
×