CM Chandrababu: గత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వారికి నరకడం తప్ప, చెట్లను నాటడం తెలీదన్నారు. ఒక్కడికైనా ముఖ్యమంత్రి టూర్ వస్తున్నారంటే చాలు రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికేవారని గుర్తు చేశారు. వాటి వల్ల వచ్చే ఉపయోగాలు వాళ్లకు తెలియదన్నారు.
జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురష్కరించుకుని తుళ్ళూరు మండలానికి వెళ్లారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతవరం గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమానికి వారిరువు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్లను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఆనాటి వైసీపీ ప్రభుత్వంలోని రోజులను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి చెట్లను నాటడం తెలీదని, కేవలం నరకడం మాత్రమే తెలుసన్నారు. నరికే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. గతంలో ఎక్కడికైనా సీఎం హెలికాప్టర్‌లో వెళ్తుంటే కిందనున్న చెట్లను నరికివేసే వారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖలో కూడా అలాగే జరిగింది.
తాను ఇవాళ ఈ గ్రామానికి హెలికాప్టర్‌లో వచ్చామని ఎక్కడైనా ఒక్క చెట్టును నరికామా? అని సభకు హాజరైన వారిని ప్రశ్న వేశారు సీఎం చంద్రబాబు. చెట్లను పెంచడం మనందరి బాధ్యతని తెలిపారు. ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. ఈ ఏడాది ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ: అంబటి రాంబాబుపై కేసు.. నేను భయపడాలా? అంటూ సూటి ప్రశ్న
వైసీపీ ప్రభుత్వం హయాంలో వివిధ కార్యక్రమాల సందర్భంగా జగన్ జిల్లాలకు వెళ్లేవారు. ఆ సమయంలో రోడ్ల మధ్యలో ఉన్న చెట్లను తొలగించేవారు. దీనిపై పర్యావరణ వేత్తలు గగ్గోలు పెట్టేవారు. రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టేసేవారు అధికారులు. కంచె కట్టి ప్రజల చేత టాటాలు చెప్పించుకునేవారు.
వివిధ జిల్లాల బస్సులను జగన్ సభలకు తరలించేవారు. ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అలాంటి ఆ పరిస్థితి లేదని చెప్పకనే చెప్పేశారు. ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వ పాలన గుర్తు చేస్తూ ఆ పార్టీ పాలనపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు సీఎం చంద్రబాబు.
గత ప్రభుత్వానికి చెట్లను నరకడం తప్ప నాటడం తెలియదు
చెట్ల వల్ల వచ్చే ఉపయోగాలు కూడా వాళ్లకు తెలియదు
ఎక్కడైనా సీఎం హెలికాప్టర్ లో వస్తుంటే కింద ఉన్న చెట్లన్నీ ఎగిరిపోతాయి
కానీ ఈరోజు నేను హెలికాప్టర్ లో వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టును నరికామా?
చెట్లను పెంచడం మనందరి బాధ్యత
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2025