BigTV English

APL 2025: నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ… భీమవరం బుల్లోడులాగా మారబోతున్న తెలుగోడు

APL 2025: నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ… భీమవరం బుల్లోడులాగా మారబోతున్న తెలుగోడు
Advertisement

APL 2025:  టీమిండియా స్టార్ క్రికెటర్, ప్రస్తుత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బంపర్ ఆఫర్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అద్భుతంగా రానించి టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న నితీష్ కుమార్ రెడ్డి… ఇప్పుడు జట్టులో బలమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి మరో బంపర్ ఆఫర్ తగిలింది. తాజాగా నితీష్ కుమార్ రెడ్డికి ఏకంగా కెప్టెన్సీ పదవి వచ్చేసింది. అయితే ఈ కెప్టెన్సీ పదవి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో దక్కింది.


తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. వైజాగ్ నుంచి… టీమిండియా వరకు.. చేరుకొని అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ మనోడు అతి తక్కువ కాలంలోనే టీమ్ ఇండియాలో ఛాన్స్ కొట్టేశాడు. అంతేకాదు 2024 సంవత్సరంలో… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్లో కూడా ఆల్రౌండర్ రూపంలో బరిలోకి దిగాడు. అక్కడ అద్భుతంగా రాణించడంతో.. వరుసగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ లు ఇస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


అయితే టీమిండియాలో ప్రస్తుతం కీలక ప్లేయర్గా కొనసాగుతున్న నితీష్ కుమార్ రెడ్డికి మరో బంపర్ ఆఫర్ తగిలింది. అతి త్వరలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ పదవి వచ్చింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భీమవరం బుల్స్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే జట్టులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి తాజాగా కెప్టెన్సీ పదవి ఇచ్చింది యాజమాన్యం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. మొన్నటి వరకు ఆల్రౌండర్ గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నాడు అన్నమాట. దీంతో నితీష్ కుమార్ రెడ్డి అభిమానులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Bizarre Run Out: టీమిండియా మహిళల జట్టులో బద్ధకం… సింగిల్స్ కూడా తీయడం చేతకావడం లేదా.. హర్లీన్ డియోల్ పై ట్రోలింగ్

ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఐపీఎల్ తరహాలోని ఈ ఏపీఎల్ ను నిర్వహిస్తారు. అయితే ఈసారి ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫైనల్ అయింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025 లో… మొత్తం 25 మ్యాచ్ లు జరగబోతున్నాయి.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2025: భీమవరం బుల్స్ ఫుల్ స్క్వాడ్

నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, మునీష్ వర్మ, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, ఎం యువన్, బి సాత్విక్, కె రేవంత్ రెడ్డి, సాయి సూర్య తేజ రెడ్డి, సిహెచ్ శివ, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, ఎన్ హిమాకర్, జె ప్రకాష్ రావు, పి. దత్తా

Related News

Virat Kohli Duck: విరాట్ కోహ్లీ మ‌రోసారి డ‌కౌట్‌..ఏకంగా 40 సార్లు, పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా

IND VS AUS, 2nd ODI: ర‌నౌట్ చేసేందుకు గిల్ కుట్ర‌లు..కొంచెంలో మిస్..అదిరిపోయే డైవ్ చేసిన రోహిత్ శ‌ర్మ

INDW vs NZW: ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్‌..ఓడితే ఇంటికి వెళ్లి గిన్నెలు తోముకోవాల్సిందే !

IND VS AUS: నేడే ఆస్ట్రేలియాతో రెండో వ‌న్డే..వ‌ర్షం అడ్డంకి..రోహిత్‌, కోహ్లీ ఇదే చివ‌రి మ్యాచ్ !

PAK vs SA: వికెట్ల‌ను బ్యాట్ తో కొట్టిన‌ రిజ్వాన్..అంపైర్ షాకింగ్ నిర్ణ‌యం..మిస్బాకు కీల‌క ప‌ద‌వి

Shubman Gill: వివాదంలో శుభమాన్ గిల్.. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్‌..షేక్ హ్యాండ్ ఇచ్చి మ‌రీ !

IND VS AUS: అడిలైడ్‌లో స‌రిగ్గా ఆడ‌క‌పోతే ఇంటికి పంపిస్తా…రోహిత్‌, కోహ్లీకి గంభీర్ వార్నింగ్‌

Shama Mohamed: టీమిండియాలో హిందువులే ఛాన్స్‌..”ఖాన్” అని పేరుంటే సెల‌క్ట్ చేయ‌రా ?

Big Stories

×