E-Paper
Advertisement

Best Test XI of 2023 : వరల్డ్ బెస్ట్ IX.. రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు..

Best Test XI of 2023 : వరల్డ్ బెస్ట్ IX.. రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు..
Advertisement

Best Test XI of 2023 : క్రికెట్ ఆస్ట్రేలియా 2023 సంవత్సరానికి.. ఆ ఏడాదిలో ఎవరు బాగా ఆడారో చూసి, అన్ని దేశాల నుంచి 11మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్ నెగ్గిన కమిన్స్‌ను టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితో ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. భారత క్రీడాభిమానులు ఇది నిజంగా అవమానమేనని అంటున్నారు. కావాలనే వారిద్దరినీ తప్పించి, వ్యూహాత్మకంగా భారత జట్టులో వారికి స్థానం లేకుండా చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఇంతకుముందు ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే సైతం రోహిత్, విరాట్ కి తన జట్టులో స్థానం కల్పించలేదు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ప్రకటించిన 11మంది జట్టులో కాంబినేషన్ బాగాలేదని అన్నారు. ఎందుకంటే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్  స్టువర్డ్ బ్రాడ్  ను ఎంపిక చేశారు. అలాగే 2023లో అతి తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ కి అవకాశం ఇచ్చారు. మరిదెక్కడి లెక్కో అర్థం కాలేదని అంటున్నారు.

Advertisement

ఇంతకీ క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ లో ఎవరిని సెలక్ట్ చేసిందని అంటే, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు, భారత్ నుంచి ఇద్దరు, పాకిస్తాన్, కివీస్, ఐర్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాల నుంచి ఒకొక్కరిని ఎంపిక చేసింది.

క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: భారత్ నుంచి రవీంద్ర జడేజా, అశ్విన్; పాకిస్తాన్ నుంచి ఉస్మాన్ ఖవాజా,  దక్షిణాఫ్రికా పేసర్ రబాడ,  శ్రీలంక నుంచి కరుణరత్నే, ఇంగ్లాండ్ నుంచి జో రూట్,  వెటరన్ ప్లేయర్  స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్,  ఆస్ట్రేలియా నుంచి కమిన్స్ , కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, ఐర్లాండ్ వికెట్ కీపర లోర్కన్ టక్కర్‌ లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

Tags

Related News

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

Big Stories

Advertisement
×