BigTV English

World Cup Trophy : అంతరిక్షంలోకి వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ.. ఐసీసీ వెరైటీ ప్రచారం..

World Cup Trophy : అంతరిక్షంలోకి వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ.. ఐసీసీ వెరైటీ ప్రచారం..

World Cup Trophy: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు మరో 3 నెలల మాత్రమే సమయం ఉంది. భారత్‌ ఉపఖండంలో జరిగే ఈ టోర్నీ కోసం ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని చేపట్టారు. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని అంతరిక్షంలోకి పంపించాయి. ఇలా ఈ టోర్నిపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.


బిస్పోక్‌ బెలూన్‌తో జత చేసిన వరల్డ్ కప్ ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్ఫియర్‌ కు చేరింది. అక్కడ 4కె కెమెరాతో కొన్ని షాట్స్‌ తీశారు. ఆ తర్వాత ట్రోఫీ నేలపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఇది నేరుగా వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకుంది.

మంగళవారం నుంచి ఈ ట్రోఫీ .. వరల్డ్‌ టూర్‌ ప్రారంభమవుతుంది. మొత్తం 18 దేశాల్లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శిస్తారు. మలేసియా, కువైట్, బహ్రెయిన్, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లోనూ ఈ ట్రోఫీ సందడి చేస్తుంది. ముంబైలో జరిగే ఈవెంట్ లో వన్డే వరల్డ్‌ కప్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. వన్డే ప్రపంచ కప్ ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×