Wedding Cancel Food Delay| ఆ యువతి పెళ్లికూతురుగా ముస్తాబై ఉదయం నుంచి కూర్చొని ఉంది. ఆ రోజు ఆమె పెళ్లి. వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా భారీగా కల్యాణ మండపానికి వచ్చారు. అందరికీ పెళ్లికూతరు తండ్రి సపద మర్యాదలు చేశాడు. కానీ భోజనం సమయంలో కాస్త ఆలస్యమైంది. పంక్తిలో అందరూ కూర్చొని ఎదురుచూస్తున్నా.. వంట లేటైందని తెలియడంతో పెళ్లికొడుకు బంధువులు ఎద్దేవా చేశారు. దీంతో అక్కడ గొడవ జరిగింది. పెళ్లికొడుకు ఇదంతా తమకు జరిగిన అవమానంగా భావించి తిరిగివెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసి పెళ్లికూతురు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి పట్టానికి సమీపంలో హమీద్ పూర్ గ్రామంలో నివసించే జరీనా (పేరు మార్చబడినది) అనే యువతితో చందౌలి పట్టణానికి చెందిన మెహ్తాబ్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 22, 2024న మధ్యాహ్నం మెహ్తాబ్ గుర్రంపై కూర్చొని తన బంధువులతో బాబా బజంత్రీలతో పెళ్లికూతురు గ్రామానికి చేరుకున్నాడు.
పెళ్లికూతరు తండ్రి వివాహానికి బాగానే ఖర్చుపెట్టారు. వచ్చిన వియ్యంకుల వారికి అన్ని మర్యాదలు చేశారు. వారు అడిగిన రూ.1.5 లక్ష నగదుని కూడా పెళ్లి సమయంలో వారికి అందించాడు. కానీ భోజనం సమయంలో చేసిన వంట అందరికీ సరిపడ లేదు. దీంతో మళ్లీ త్వరగా వంట ప్రారంభించారు. అయితే చివర్లో పెళ్లికొడుకు స్నేహితులు భోజనాలు కోసం కూర్చోన్నారు. వంట లేటు అయ్యే సరికి వారంతా పెళ్లికొడుకుని ఎద్దేవా చేశారు. వారి మాటలు విని పెళ్లి కూతురు తండ్రి తమను అవమానించాడని వరుడు గొడవ చేశాడు. దీంతో పెళ్లి కూతురు బంధువులు కూడా వాగ్వాదానికి దిగారు.
Also Read: ఇంట్లో తలుపుకు ఉరివేయబడ్డ మహిళ.. పోలీసులే చంపారని ఆరోపిస్తున్న భర్త
ఈ క్రమంలో తోపులాట జరిగింది. పెళ్లికూతురు తండ్రిని వరుడి స్నేహితులు కొట్టారు. గ్రామ పెద్దలు కలుగజేసుకొని శాంతింప చేసినా.. పెళ్లి రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఇంతటితో అయిపోలేదు. అదే రోజు రాత్రి మెహ్తాబ్ తన మేనమామ కూతురితో నికా (పెళ్లి) చేసుకున్నాడు. ఈ విషయం ఫోన్ చేసి జరీనాకు చెప్పాడు. తమకు అన్యాయం జరిగిందని పెళ్లికూతురు జరీనా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం ఖర్చు పెట్టిన రూ.7 లక్షలు, పెళ్లికి ముందు ఇచ్చిన రూ.1.5 లక్ష నగదు తిరిగి ఇప్పించాలని కేసు పెట్టింది.
కానీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో జిల్లా ఎస్ పి ఆదిత్య లాఘే వద్దకు డిసెంబర్ 24 న వెళ్లారు. తమకు న్యాయం చేయాలని జరీనా అడిగింది. విషయం తెలుసుకున్న ఎస్ పి ఆదిత్య లాఘే.. ఇరు పక్షాలను పిలిచి రాజీ కుదిర్చారు. ప్రస్తుతం మెహ్తాబ్ కుటుంబం జరీనా తండ్రికి రూ.1.61 లక్షలు తిరిగి ఇచ్చినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ రాయ్ చెప్పారు.