Pakistan Cricket: క్రికెట్… ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న గేమ్. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన క్రికెట్ ఆడడం చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో రకరకాల టోర్నమెంట్లు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో అరుదైన రికార్డులు కూడా క్రికెట్ చరిత్రలో నమోదు అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ లోని డొమెస్టిక్ క్రికెట్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. 231 సంవత్సరాల ప్రపంచ రికార్డును ఈ పాకిస్తాన్ దేశానికి చెందిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు బద్దలు కొట్టింది. ఓ మ్యాచ్ లో పాకిస్తాన్ టెలివిజన్ జట్టు ( Pakistan Television) నలభై పరుగులు చేయగా.. సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకు ఆలౌట్ అయి ఈ చరిత్ర సృష్టించింది. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైనల్..ఇక మనోళ్లను ఆపడం కష్టమే
పాకిస్తాన్ దేశంలో దేశవాళీ జట్లు చాలానే ఉన్నాయి. ఆ దేశంలో ప్రస్తుతం క్వాయిడ్ ఏ ఆజాం ట్రోఫీ ( Quaid-e-Azam Trophy 2026) జరుగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ టెలివిజన్ వర్సెస్ సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్ల ( Sui Northern Gas Pipelines Limited) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 40 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు ముందు పాకిస్తాన్ టెలివిజన్ జట్టు ఉంచింది. అయితే ఈ 40 పై పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 19.4 ఓవర్లు ఆడిన జట్టు… దారుణంగా వికెట్లు కోల్పోయి 37 పరుగులకు కుప్పకూలింది. ఇందులో ముగ్గురు డక్ అవుట్ కాగా ఒకే ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. అందరూ సింగిల్ డిజిట్ కు ఫెవిలియన్ కి వెళ్లారు. ఇక 2 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు 231 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 1794 సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో కెంట్ జట్టుపై 44 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది మెరిల్బోన్ క్రికెట్ క్లబ్. ఇక ఇప్పుడు ఆ రికార్డును పాకిస్తాన్ టెలివిజన్ జట్టు… సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ పై బద్దలు కొట్టింది.
దేశవాళి క్రికెట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు, తొలి ఇన్నింగ్స్ లో 166 పరుగులు సాధించింది. అటు సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు మొదటి న్యూస్ లో 238 పరుగులు సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ టెలివిజన్ 111 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. ఇటు సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్ టెలివిజన్.
Defending just 40 runs, Pakistan TV bowled out Sui Northern for 37 at Karachi to break a 232-year-old record – the lowest total ever successfully defended.
The previous record was held by Oldfield when they defended 41 v MCC to win by 6 runs in 1794.pic.twitter.com/9mthqyGqGu
— Cricketopia (@CricketopiaCom) January 17, 2026
One thing stands out: SNGPL were bowled out for 37 while chasing 40, breaking a 232-year-old first-class cricket record. Shan Masood was the captain, yet hardly anyone mentioned that a Pakistan Test captain’s team collapsed to such a historic low. If Babar Azam had been part of… pic.twitter.com/4zzunjFcbO
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) January 18, 2026