Pakistan Pacer Ihsanullah Serious On PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. ప్లేయర్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని మొదటి నుంచి బోర్డుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. చాలా మంది క్రికెటర్లు దేశవాళీ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టించుకోవడం లేదు. ఖుష్దిల్ షా లాంటి వాళ్లయితే మహమ్మద్ అమీర్ తరహాలో పాకిస్తాన్ దేశాన్ని వదిలేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి క్రమంలో మరో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా ( Pakistan Pacer Ihsanullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు గాయమైనప్పుడు పట్టించుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు జాతీయ జట్టులోకి కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.
రెండేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న తాను.. ఫిట్నెస్ ఇప్పుడు సాధించాలని వెల్లడించారు ఇహ్సానుల్లా. అయినప్పటికీ దేశవాళి క్రికెట్ లో కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ సభ్యులు మిస్బా ఉల్ హక్ (Mishbah- Ul haq), అకీబ్ జావేద్ లకు (Aaqib Javed) ఫోన్లు చేసినా కూడా ఎత్తడం లేదని మండిపడ్డారు. దేశవాళి క్రికెట్ లో తనకు అవకాశం ఇవ్వకపోతే… జాతీయ జట్టులోకి ఎలా ఎంట్రీ ఇస్తాను ? అంటూ నిలదీశారు. తనకు న్యాయం చేయండి అంటూ వేడుకున్నారు. మొదటి నుంచి నన్ను పశువు కంటే హీనంగా చూస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
2023 సంవత్సరంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జాతీయ జట్టులోనే ఉన్నాడు ఇహ్సానుల్లా. చేతికి గాయమైనప్పుడు అతనికి వైద్యం అందించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు రాలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిగివచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వెంటనే అతడికి లండన్ లో స్పెషల్ ట్రీట్మెంట్ అందించింది. ఆ తర్వాత అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అప్పటి నుంచి జాతీయ జట్టులో అవకాశం కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నాడు ఇహ్సానుల్లా.
2023 తర్వాత జాతీయ జట్టు నుంచి తప్పించబడ్డ ఇహ్సానుల్లా.. ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు. దేశవాళీ అలాగే జాతీయ జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 140 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు సందించగలడు. అయినప్పటికీ తనను దేశవాళీ క్రికెట్ ఆడకుండా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇహ్సానుల్లా. దీనిపై మిస్బా ఉల్ హక్ (Mishbah- Ul haq), అకీబ్ జావేద్ లకు (Aaqib Javed) ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని మండిపడ్డారు. దేశవాళీ క్రికెట్లో అవకాశం ఇస్తేనే కదా ? తాను జాతీయ జట్టులోకి వచ్చేది అంటూ ప్రశ్నించారు. తనకు ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో ఇహ్సానుల్లా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.