E-Paper
Advertisement

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!
Advertisement

Hyderabad Roads: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం హెచ్‌ఎమ్‌డీఏ , హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారులకు సీఎం ఆదేశాలు..

Advertisement

ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శి మణిక్ రాజ్, హెచ్ ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా అన్ని రకాల రోడ్డు నెట్‌వర్క్‌లను ఒకే డిజిటల్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు , రీజినల్ రింగ్ రోడ్డు , నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, అంతర్గత రోడ్లన్నీ ఇకపై ఒకే వ్యవస్థ కింద పనిచేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. భూసేకరణ, బ్యాంక్ రుణాలు, రోడ్ల దెబ్బతినడం, నిరంతర నిర్వహణ వంటి ప్రతి అంశాన్ని ఈ సిస్టమ్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై సీఎం ఫైర్..

Advertisement

ఓఆర్‌ఆర్ నిర్వహణ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రోడ్డుపై పక్కన ప్లానింగ్ లేకుండా వాహనాలు నిలపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పర్యవేక్షణను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇక ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.ప్రభుత్వం అధికారికంగా సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ కేటాయించాలని సీఎం సూచించారు. టీడీఆర్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసి, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా తీర్చిదిద్దాలని సీఎం
ఆదేశించారు.

కొంగరకలాన్ – ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్డుకు డెడ్‌లైన్..

​నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.మరోరవైపు కొంగరకలాన్ నుంచి ‘ఫ్యూచర్ సిటీ’ వరకు వెళ్లే రేడియల్ రోడ్ 1 పనులను ఈ ఏడాది డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు. రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని సీఎం నొక్కి చెప్పారు. భవిష్యత్తులో రోడ్లు కుంగిపోకుండా వాడే మట్టి నాణ్యతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం (ప్లాంటేషన్) పెంచేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ నిర్మాణం అత్యంత కీలకమని, అక్కడ పనులు వేగవంతం చేయాలన్నారు.

ఎలివేటెడ్ కారిడార్లపై ఫోకస్..

ఎలివేటెడ్ కారిడార్స్ 1, 111 పనులను స్పీడప్ చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా బంజారా హిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. రోడ్ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని భాగస్వాములను చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో మధ్యవర్తుల (దళారుల) జోక్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు అంతా మనం చేపట్టే రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నదని, అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఊరుకునేది లేదని సీఎం నొక్కి చెప్పారు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రేజీ నియామకం.. టీపీసీసీ మీడియా చైర్మన్‌గా చామల కిరణ్!

Tags

Related News

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×