
Pakistan Captain Babar : ఎట్టకేలకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ నోరు విప్పాడు. అంతేకాదు తనని ఇంతకాలం విమర్శిస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. టీవీలు చూస్తూ ఎవడైనా సలహాలిస్తాడు. ఇక్కడ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఆ టెన్షన్ పడ్డవాడికి తెలుస్తుందని అన్నాడు. భారతీయుల అభిమానం, ఆతిథ్యం మరువలేనిదని అన్నాడు. ఆటని ఆటగానే చూడటం గొప్ప విషయమని అన్నారు. హైదరాబాద్ బిర్యానీ అద్భుతంగా ఉందని పాకిస్తాన్ ఆటగాళ్లు మెచ్చుకోవడం విశేషం.
మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు బాబర్ ఓపికగా సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ కథ ముగిసిపోలేదని అన్నాడు. మా ప్లాన్స్ మాకున్నాయి. నెట్ రన్ రేట్ పెంచుకుని ఎలా ఆడాలో అలాగే ఆడతామని అన్నాడు. అడ్డదిడ్డంగా అయితే ఆడమని అన్నాడు. కానీ స్టార్టింగ్ నుంచి ఎటాకింగ్ మోడ్ లోనే వెళతామని అన్నాడు. క్రికెట్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అన్నాడు.
ఫకర్ జమాన్ కనీసం 20 నుంచి 30 ఓవర్లు గానీ ఉంటే, మ్యాచ్ పై మాదే పైచేయి అని అన్నాడు. అతని మాటల్లో అందరికీ అర్థమైనదేమిటంటే టాస్ గెలిస్తే గానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 400పైనే పరుగులు చేయాలి. తర్వాత ఇంగ్లండ్ ని 120 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఇదొక్క మార్గం మినహా మరొకటి లేదు. అందుకే చావో రేవో అన్నట్టు ఆడుతారని బాబర్ మాటల ద్వారా అర్థమైంది. ఇఫ్తికర్ అహ్మద్, రిజ్వాన్ కూడా మ్యాచ్ విన్నర్లేనని తెలిపాడు.
తను మాత్రం వరల్డ్ కప్ లో స్థాయికి తగినట్టుగా ఆడలేదని ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా కెప్టెన్ గా ఉన్నాను. ఒత్తిడి ఎప్పుడూ పడలేదని అన్నాడు. బహుశా నా ఆట తీరు వల్ల ఉంటే ఒత్తిడి ఉండవచ్చుగానీ, కెప్టెన్సీ వల్ల కాదని అన్నాడు. చివరిగా సొంత దేశంలోని సీనియర్లు చేసిన కామెంట్లపై మాట్లాడుతూ టీవీల్లో చూసి సలహాలు ఎవడైనా చెబుతాడు. వారికి అంతగా సూచనలు చేయాలనిపిస్తే, నా ఫోన్ నంబర్ అందరి దగ్గరా ఉంది. నాకు వ్యక్తిగతంగా చేసి ఆటలో ఈ మార్పులు చేసుకోమని చెప్పవచ్చు కదా..అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
ipl 2023 commentary in Bhojpuri : ఐపీఎల్ భోజ్‌పురి కామెంటరీకి సూపర్ హిట్ టాక్.. చెప్పేది మన రేసుగుర్రం మద్దాల శివారెడ్డి