
Fire Accident : రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సన్‌సిటీ వద్ద క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఫుడ్ కోర్టుకు మంటలు వ్యాపించడంతో.. అందులోని గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో మూడు షాఫులకు కూడా ఈ మంటలు విస్తరించాయి. 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపు చేస్తున్నారు.
అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదానికి గురైన టపాసుల షాప్ కు ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ సిబ్బంది,పోలీసులు తెలిపారు.
.
.
.