E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

టీమిండియా ఛాప్ట‌ర్ క్లోజ్‌..నెక్ట్స్‌ పాకిస్తాన్, ఐర్లాండ్ కొత్త షెడ్య‌ల్ ఇదే

టీమిండియా ఛాప్ట‌ర్ క్లోజ్‌..నెక్ట్స్‌ పాకిస్తాన్, ఐర్లాండ్ కొత్త షెడ్య‌ల్ ఇదే
Advertisement

Ireland vs Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup tournament) విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను (Team India) మట్టి కల్పించిన ఐర్లాండ్, మరో పోరుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ లో అడుగుపెట్టి ఆ జట్టును కూడా, పాతాళానికి తొక్కెందుకు రెడీ అవుతోంది ఐర్లాండ్. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) అదిరిపోయే ప్లాన్ చేసింది. జింబాబ్వే, ఐర్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ ట్రై సిరీస్ 2027 లో జనవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డేనా ? లేదా టి20నా ఏ ఫార్మాట్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఉన్న త‌రుణంలో వ‌న్డే పార్మాట్ లోనే జ‌రిగే అవ‌కాశాలు ఉండ‌నున్నాయి.  దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

పాక్‌ ను పాతాళానికి తొక్కేందుకు వస్తోన్న‌ ఐర్లాండ్

Advertisement

టీమిండియాపై అద్భుతంగా రాణించి ఇటీవల టి20 సిరీస్ కైవసం చేసుకుంది ఐర్లాండ్. ఈ రెండు జట్ల మధ్య రెండు టీ20 లు జరగగా, టీమిండియాను వైట్ వాష్ చేసింది ఐర్లాండ్. 5 గురు స్టార్ క్రికెట‌ర్లు గాయాల బారీన ప‌డినా, వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 జ‌ట్టు టీమిండియాను మ‌ట్టి క‌రిపించింది ఐర్లాండ్. ఇక ఈ ఊపుతో ట్రై సిరీస్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్, ఐర్లాండ్ అలాగే జింబాబ్వే మధ్య ఈ ట్రై సిరీస్ 2027 జనవరిలో ఉంటుంది. ఈ ట్రై సిరీస్ కోసం లాహోర్ లోని గడాఫీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియాలను సిద్ధం చేయబోతున్నారట. ఇందులో ఎలాగైనా గెలిచి, ముందుకు వెళ్లాల‌ని ఐర్లాండ్ ప్లాన్ చేస్తోంది. అటు సొంత గ‌డ్డ‌పై జ‌రిగే ఈ టోర్న‌మెంట్ లో గెలిచా స‌త్తా చాటేందుకు పాక్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది. టీమిండియా త‌ర‌హాలో ఓడిపోకుండా, రివ‌ర్స్ ఎటాక్ చేసేందుకు పాక్ రెడీ అవుతోంది.

ట్రై సిరీస్ లకు ప్రాధాన్యత ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

తమ సొంత గడ్డపై వరుసగా ట్రై సిరీస్ లు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే 2026 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య వన్డే ట్రై సిరీస్ జరిపేలా PCB నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్ కు కూడా ఆమోదం తెలిపింది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే 2027 జనవరిలో జింబాబ్వే, ఐర్లాండ్ అలాగే పాకిస్తాన్ చెట్ల మధ్య ట్రై సిరీస్ షురూ అవుతుంది. అనంతరం 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ పై పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫోకస్ చేయనుంది.

Advertisement

 

 

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

 

Related News

టీమిండియాలో ముంబై వాళ్ల‌కే అవ‌కాశాలు.. బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్ ?

ఒలింపిక్స్ 2028కి ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్‌..డిసెంబ‌ర్ 31కి డెడ్ లైన్‌

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఇక వాళ్ల‌ను దేవుడు కూడా కాపాడ‌లేడు

Tanveer Ahmed: టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను

టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు..ఇప్పుడు ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

Big Stories

×