Best Dyson vacuum cleaners for home: ప్రతి రోజూ ఇల్లు శుభ్రం చేయడం అంటే.. మాటలు కాదు, అది చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ, ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ కష్టాన్ని ఈజీగా మార్చుకోవచ్చు. డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు వాటి పవర్‌ఫుల్ సక్షన్ , వైర్‌లెస్ సౌకర్యంతో క్లీనింగ్‌ను చాలా ఈజీ చేస్తాయి. దుమ్ము, ధూళి నుంచి మీ ఇంటిని రక్షించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీ బిజీ లైఫ్ స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే 5 బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. హైజీనిక్ క్లీనింగ్ అందిస్తాయి.
డైసన్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ప్రీమియం మోడల్ ధర సుమారు రూ.65,000 నుంచి రూ. 70,000 వరకు ఉంటుంది. ఇది డైసన్ బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్‌గా పేరుగాంచింది. ఇందులో ఉండే లేటెస్ట్ లేజర్ టెక్నాలజీ కంటికి కనిపించని సూక్ష్మ ధూళిని కూడా స్పష్టంగా శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా ఇంటి మూలల నుంచి కార్పెట్ల వరకు అన్నింటినీ పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసే ఈ డివైస్‌లోని LCD స్క్రీన్ ఎంత దుమ్ము క్లీన్ అయిందో లైవ్‌లో చూపిస్తుంది.
రూ.50,000 నుంచి రూ.55,000 ధరలో లభించే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా సింపుల్ డిజైన్‌తో వస్తుంది. దీన్ని మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. దీనిలో ఉండే ‘పైజో సెన్సార్’ నేలపై ఉన్న దుమ్మును బట్టి సక్షన్ పవర్‌ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. తక్కువ బరువుతో ఉండి.. ఎక్కువ ఆశించేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
మార్కెట్లో రూ.45,000 నుంచి రూ.50,000 ధరలో లభించే డైసన్ V11, బడ్జెట్ , పర్ఫార్మెన్స్ మధ్య అద్భుతమైన బ్యాలెన్స్‌ను ఇస్తుంది. ఇది వివిధ రకాల సర్ఫేస్‌లపై అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనిలో.. ఉండే ఇంటెలిజెంట్ క్లీనింగ్ మోడ్స్ ద్వారా బ్యాటరీ ఎంత సమయం వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు, ఇది రోజువారీ పనులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
రూ.35,000 నుంచి రూ. 40,000 ధర గల ఈ మోడల్ పేరుకు తగ్గట్టే.. నేలపై చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. చిన్న చిన్న ఇళ్లు లేదా ఫ్లాట్స్‌లో.. నివసించేవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఫర్నిచర్ కింద ,ఇరుకైన మూలల్లో ఉండే చెత్తను సైతం ఇబ్బంది లేకుండా తొలగించడానికి దీని ప్రత్యేకమైన డిజైన్ ఎంతగానో హెల్ప్ అవుతుంది.
Also Read: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? దీని కంటే..బెస్ట్ ఉండదేమో !
మీరు మొదటి సారిగా వైర్‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను కొనాలని అనుకుంటే, రూ.30,000 నుంచి రూ. 35,000 ధర కలిగిన V8 ఒక గొప్ప ప్రారంభం అవుతుంది. దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఇది రోజువారీ క్లీనింగ్ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఇది చిన్న సైజ్ లో ఉండటం వల్ల ఇంట్లో స్టోరేజ్ సమస్య అసలు రాదు.
డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు కేవలం హోం అప్లయన్సెస్‌గా మాత్రమే కావు.. ఇవి మీ ఇంటిని ఆరోగ్యకరంగా, శుభ్రంగా ఉంచే ఒక అద్భుతమైన పెట్టుబడి. పైన పేర్కొన్న మోడల్స్ ప్రతి ఒక్కరి అవసరాలకు, బడ్జెట్‌కు తగినట్టుగా ఉండి, క్లీనింగ్ కష్టాలను దూరం చేస్తాయి.