Tymal Mills On IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament) చాలా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తోంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఇప్పటి వరకు 19 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ 19 సీజన్లలో ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఐపీఎల్ కు వచ్చింది. కరోనా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ ఇలా ఎన్నో విపత్తులు అడ్డు తగిలినప్పటికీ… బిసిసిఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. ముందుండి ఈ టోర్నమెంట్ ను నడిపించింది. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతూనే ఉన్నారు.
పొద్దున లేస్తే ఐపీఎల్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే అలస్టర్ కుక్ ఐపీఎల్ ఆడద్దని తమ ఇంగ్లాండ్ క్రికెటర్లకు హితో పదేశం చేస్తున్నారు. ఇంగ్లండ్ లోని కౌంటీ క్రికెట్ ఆడటం ఉత్తమం అంటూ కామెంట్స్ చేశారు. లేటెస్ట్ గా టైమల్ మిల్స్ (Tymal Mills) కూడా ఐపీఎల్ లో కించ పరుస్తూ మాట్లాడారు. ఐపీఎల్ నరకం లాంటిదని.. తేడా వస్తే రాళ్లతో కొడతారంటూ హెచ్చరించారు. అన్ని టోర్నమెంట్ల కంటే ఐపీఎల్ అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన ( Indian Premier League tournament) విదేశీ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు టైమల్ మిల్స్ (Tymal Mills) కూడా రియాక్ట్ అయ్యారు. ఐపీఎల్ లో విపరీతమైన ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుందని బాంబు పేల్చారు. ఐపీఎల్ కంటే ఇతర టోర్నమెంట్లు ఆడడం బెటర్ అన్నారు. డబ్బులు ఎక్కువగా వస్తాయి కావచ్చు కానీ… ఐపీఎల్ నరకం లాంటిదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో సరిగ్గా ఆడక పోతే రాళ్లతో కూడా కొడతారని హెచ్చరించారు. ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడితే సరైన రిజల్ట్ తీసుకురావాల్సిందేనని.. ఆ జట్టును గెలిపించాల్సిందేనని పేర్కొన్నారు. ఒకవేళ మనం ఫ్రాంచైజీ ద్వారా డబ్బులు తీసుకొని సరిగ్గా ఆడక పోతే, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తారని గుర్తు చేశారు. తేడా వస్తే స్టేడియంలోనే నిలదీస్తారని పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఎంతో గొప్పది.. ఇందులో వచ్చినన్ని డబ్బులు మరెక్కడ రావాలని టైమల్ మిల్స్ (Tymal Mills) తెలిపారు. అయితే అదే స్థాయిలో తీవ్రమైన ఒద్దని కూడా ఉంటుందని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందన్నారు. ఇలాంటి క్రమంలో ఈ టోర్నమెంట్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మిగతా టోర్నమెంటులో సరిగ్గా ఆడక పోతే నడుస్తుంది… కానీ ఐపీఎల్ లో విఫలమైతే మాత్రం ఆడుకుంటారని తెలిపారు. అభిమానుల ఆగ్రహానికి ప్లేయర్లు బలి కావాల్సిందేనని తెలిపారు. సరిగ్గా ఆడిన క్రికెటర్లకు ఐపీఎల్ మంచి ప్లాట్ ఫాం అంటూ వ్యాఖ్యానించారు టైమల్ మిల్స్ (Tymal Mills).