E-Paper
Advertisement

రీల్స్ పిచ్చికి భారీ మూల్యం..జెమిమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

రీల్స్ పిచ్చికి భారీ మూల్యం..జెమిమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!
Advertisement

Jemimah Rodrigues ruled out of Asia Cup 2026:   ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Womens Asia Cup 2026) జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీమ్ ఇండియా మహిళల జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు. కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుండగా.. వైస్ కెప్టెన్ గా స్మృతి మందాన ఉంటారు.

జెమీమా రోడ్రిగ్స్ కు గాయం.. తెర‌పైకి ప్ర‌తికా రావ‌ల్

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్, ఏషియన్ గేమ్స్ లో దాదాపు ఈ 15 మంది బరిలో నిలుస్తారు. అయితే ది 100 లీగ్ 2026 మహిళల టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండులో ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) ఇటీవల గాయపడ్డారు. దీంతో ఆసియా కప్ మహిళల కప్ 2026, ఏషియన్ గేమ్స్ కు జెమీమా రోడ్రిగ్స్ ను తప్పించింది బీసీసీఐ. ఆమె స్థానంలో అన్ క్యాప్డ్ మహిళ ప్లేయర్ ప్రతికా రావల్ ను తెరపైకి తీసుకువచ్చింది బీసీసీఐ. జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో ప్ర‌తికా రావల్ ఆడనున్నారు. 2025 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ప్రతికా రావ‌ల్ అద్భుతంగా రాణించారు. రెండు సెంచరీలు చేసి, గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగారు. ఇక ఇప్పుడు ప్రతికా రావల్ కు మరోసారి అవకాశం దక్కింది.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

రీల్స్ పిచ్చికి భారీ మూల్యం..జెమిమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

టీమిండియా మహిళ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తోపు క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె క్రికెట్ కంటే ఎక్కువగా రీల్స్ చేస్తూ బాగా వైరల్ అయ్యారు. అయితే 2025 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా అద్భుతంగా రాణించి జెమీమా రోడ్రిగ్స్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఏసు ప్రభువు తనను నడిపించడానికి కామెంట్ చేసి వివాదంలో ఇరుక్కుంది. అనంతరం టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా దారుణంగా విఫలమయ్యారు జెమీమా రోడ్రిగ్స్. టెస్ట్ ప్లేయర్ ను టీ20 లోకి ఎందుకు తీసుకువచ్చారని దారుణంగా ట్రోలింగ్ కూడా చేశారు జనాలు.

Advertisement

అయితే ఇప్పుడు గాయం పేరుతో ఆమెను ఆసియా కప్ 2026, ఏషియన్ గేమ్స్ నుంచి తప్పించారు. ఈ క్రమంలో రిల్స్ చేసి ఓవరాక్షన్ చేసినందుకే ఆమెను పక్కకు పెట్టారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గాయం పేరుతో ఆమెను తప్పించినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం రీల్స్ అని అంటున్నారు. దానికి తోడు టి20లకు జెమీమా రోడ్రిగ్స్ సరిపోదు అని కూడా స్పష్టం చేస్తున్నారు. అందుకే జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో రావల్ ను తీసుకున్నట్లు చెబుతున్నారు.

 

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

Related News

హార్దిక్ పాండ్యాకు డబ్బే సర్వస్వం..అందుకే సీజ‌న్ కో ఫ్రాంచైజీ మారుతున్నాడు

నా దారికే అడ్డొస్తావా ? బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ

బంగ్లాదేశ్ దూకుడు చూస్తే…ఆస్ట్రేలియా ఓడిపోయేలా ఉంది

హ్యారీ బ్రూక్ లాంటి వెధ‌వ‌ల‌ను మ‌ళ్లీ ఐపీఎల్ లోకి రానివ్వొద్దు !

మా పాకిస్తాన్ కెప్టెన్లు ద‌ద్ద‌మ్మ‌లు..400 వికెట్లు తీయ‌డానికి న‌ర‌కం అనుభ‌వించా

విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ దెబ్బ అదుర్స్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న పాకిస్తాన్‌

3 రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేసి…టీమిండియా ప్లేయ‌ర్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తాం

Big Stories

Advertisement
×