Pakistan’s Olympic qualification scenario: 2028 లాస్ ఏంజిల్స్ ( LA28 Olympic Games) వేదికగా ఒలంపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ నేపథ్యంలో ఈ సారి క్రికెట్ కూడా ఉండనుంది. దాదాపు 128 సంవత్సరాల తర్వాత ఈ ఒలంపిక్స్ క్రీడల్లో క్రికెట్ ను జత చేర్చుకున్నారు. ఈ ఒలంపిక్స్ లో టి20 ఫార్మాట్ లోనే క్రికెట్ జరగనుంది. ఇందులో భాగంగానే మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇందులో మహిళ జట్లు 6 ఉండగా… పురుషుల జట్లు మరో ఆరు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో పురుషుల పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆసియా ఖండం నుంచి కేవలం ఒకే ఒక జట్టును సెలెక్ట్ చేయబోతున్నారట. అది కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం మొదట ఎవరు ఉంటే వాళ్లకు ఆస్థానం దక్కుతుంది. ఈ లెక్క ప్రకారం ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియానే మొదటి స్థానంలో ఉంది. అంటే టీమిండియా దాదాపు తన బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
2028 లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలంపిక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ పురుషుల జట్టుకు స్థానం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఓసియానియా ఖండాల నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేయనున్నారు. ఆసియా ఖండం తరఫున ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా దాదాపు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, 2026 సంవత్సరం లోపు ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆసియా ఖండం తరఫున ఎవరు ముందు ఉంటారో వాళ్లకు ఛాన్స్ దక్కనుంది. ఈ క్రమంలో ఆరో స్థానంలో ఉన్న పాకిస్తాన్… టీమిండియాను బీట్ చేసేందుకు అవకాశం దక్కింది. డిసెంబర్ 31వ తేదీ వరకు టీమిండియాను దాటేస్తే… ఒలంపిక్స్ కు పాకిస్తాన్ వెళ్ళనుంది. నిన్న ఐర్లాండ్ చేతిలో రెండు టీ20 లు ఓడిన టీమిండియా.. ర్యాంకింగ్స్ లో తన స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
అటు ఇంగ్లాండ్ టూర్ లో కూడా టీమిండియా ఓడితే, ఆరో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఆసియా ఖండం తరఫున తొలి స్థానానికి దూసుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్ అంతా డిసెంబర్ 31వ తేదీ లోపు జరగాలి. అప్పటి వరకు టీమిండియాను బీట్ చేసి పాకిస్తాన్ ముందు ఉంటే.. వాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ఇందులో పాకిస్తాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అటు టి20 మహిళల ప్రపంచ కప్ నేపథ్యంలో టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేశారు. ఇందులో మరో రెండు జట్లు జతకానున్నాయి.