Women’s Champions Trophy 2027: ఐసీసీ (ICC) మరో కీలక ప్రకటన చేసింది. టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో, మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించింది ఐసీసీ. ఈ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ (Women’s Champions Trophy 2026) వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. టి20 ఫార్మాట్ లో ఈ మెగా టోర్నమెంటును నిర్వహించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు స్థానం దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ మహిళల జట్టుపై ట్రోల్లింగ్ మొదలైంది.
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీ 2027 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అంటే దాదాపు 15 రోజులపాటు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న జట్లు ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించాయి. అలాగే ఈ టోర్నమెంట్కు ఆదిత్యం ఇస్తున్న శ్రీలంక కూడా స్థానం దక్కించుకుంది. దీంతో ర్యాంకింగ్స్ లో ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ మహిళ జట్టుకు నిరాశ ఎదురయింది. కటాఫ్ సమయానికి పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో ఉన్న నేపథ్యంలో… ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో కేవలం 6 జట్లు మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నాయి.
ఛాంపియన్ ట్రోఫీ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుకు స్థానం ఇవ్వకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. ఐసీసీ చైర్మన్ గా ఇండియాకు సంబంధించిన జై షా ఉన్న క్రమంలోనే పాకిస్తాన్ కు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. జై షా కాకుండా మరో వ్యక్తి ఆ హోదాలో ఉంటే పాకిస్తాన్ కు అవకాశం దక్కేదని స్పష్టం చేస్తున్నారు. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 టోర్నమెంటులో కనీసం 10 జట్లు పాల్గొంటేనే, మజా వస్తుందని వెల్లడిస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు. అయితే ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడకుండా చేసేందుకే కేవలం 6 జట్లను ఫైనల్ చేసినట్లు మండిపడుతున్నారు. దీనిపై ఐసీసీ మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని.. కోరుతున్నారు. లేకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
🚨 WOMEN'S CHAMPIONS TROPHY ANNOUNCED BY ICC 🚨
– The inaugural Women's Champions Trophy is scheduled to be held in Sri Lanka from Feb 14 to Feb 28, 2027
– India, Australia, New Zealand, South Africa, England and Sri Lanka qualified
– The event will played in T20 Format pic.twitter.com/8u5L5DF9Kp
— Ajay Jadeja (@AjayJadeja171) June 28, 2026