EPAPER

CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. సీఎం రేవంత్ భేటీ..

CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. సీఎం రేవంత్ భేటీ..

CM Revanthreddy: హైదరాబాద్‌ను ఏఐ ప్రపంచ రాజధానిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని చెప్పుకొచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా రెండురోజులపాటు ఏఐ గ్లోబల్ సమిత్-2024 ప్రారంభమైంది.


ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే కావడంతో శుభాకాంక్షలు చెబుతూ తన స్పీచ్ ను సాగించారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏఐ రోడ్ మ్యాచ్ విడుదల చేశారు. అందులో 25 కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా నూతన ఏఐ సిటీ లోగో లాంఛ్ చేశారు.

ALSO READ: హైదరాబాద్‌లో చిక్కిన ముఠా.. భారీగా గోవా లిక్కర్ సీజ్..


రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు ఏఐ స్థాయికి వచ్చామన్నారు సీఎం రేవంత్. క్రమంగా టెక్నాలజీ వినియోగం పెరుగుతోందన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇతర పరిజ్ఞానానికి చెందినవారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నామని ప్రధానంగా ప్రస్తావించారు సీఎం రేవంత్‌రెడ్డి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ సిటీ సిద్ధంగా లేదన్నారు. ఆవిష్కరణలకు పారిశ్రామిక వేత్తలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు.

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏఐలో పట్టు సాధించబోతున్నామని, తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ఏఐ విషయంలో డీప్ ఫేక్ లాంటి సంఘటనలు జరగ కుండా సరైన దానిలో ఉపయోగించుకోవాలన్నారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఎథికల్ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచస్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. వివిధ దేశాల నుంచి దాదాపు రెండు వేల మంది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేకింగ్ ఏఐ వర్స్ ఫర్ ఎవ్రీ వన్ అనే థీమ్‌తో జరుగుతోంది. ఈ సందర్భంగా యోట్ట ఇన్‌ఫ్రా సొల్యూషన్ ఎల్ఎల్ఫీ సీఈవో సునీల్‌గుప్తా, జే-పాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

ఏఐ రంగం అభివృద్ధిపై సుధీర్ఘంగా చర్చించారు. మన దేశంలో ఏఐ గ్లోబల్ సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఆ ఘనతను హైదరాబాద్ సిటీ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ కంపెనీల సీఈవోలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

 

 

Related News

TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్

Hyderabad Mayor: అనూహ్యంగా మెట్రో రైలులో ప్రయాణించిన మేయర్.. ఆమెను చూసి అంతా షాక్!

BRS Leaders: రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్టు

Arekapudi Gandhi vs Kaushik Reddy: కౌషిక్ రెడ్డితో గొడవ.. అరెకపూడి‌కి షాక్ ఇచ్చిన పోలీసులు

Ganesh Nimajjanam 2024: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ

Mahesh Kumar Goud: సెంటిమెంట్ కుర్చీ.. కథ పెద్దదే!

Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!

Big Stories

×