Musheer Khan : ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 ని గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీ.. క్వాలిఫయర్ 2 ని గెలవడం ద్వారా పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్ కి చేరుకుంది. దీంతో ఫైనల్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను భారీ తేడాతో ఓడించింది. పంజాబ్ క్వాలిఫయర్ 1లో పేలవ ప్రదర్శన చేసింది. ఆ మ్యాచ్ లో పంజాబ్ జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. పంజాబ్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ముషీర్ ఖాన్ కి లభించింది. ఇక అదే సమయంలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కోసం గార్డ్ తీసుకుంటున్నప్పుడు స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అతన్ని అవమానించాడని అప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Also Read : RCB – Evil Eye : టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్ ప్లానింగ్… కారు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మరీ
మరోవైపు తాజాగా విరాట్ కోహ్లీ పరువు తీశాడు ముషీర్ ఖాన్. ఆర్సీబీ ని టైటిల్ గెలవనివ్వబోమంటూ సిగ్నల్ ఇఛ్చాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ కి ముందు విరాట్ కోహ్లీ పరువు తీశాడని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం. వాస్తవానికి ముషీర్ ఖాన్‌కు ఈ సీజన్‌లో తొలిసారి ఆడే అవకాశం క్వాలిఫయర్ 1లో వచ్చింది. కానీ అతను దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేర్చింది. కానీ అతను ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ముషీర్ బ్యాటింగ్‌కు గార్డ్ తీసుకుంటున్నప్పుడు కోహ్లీ అతని వైపు చూపిస్తూ ఏదో చెబుతున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో క్యాప్షన్‌లో విరాట్ కోహ్లీ భారత ఆటగాడిని అవమానించాడని.. “ఆటగాడిని వాటర్ బాటిల్‌తో ఆడటానికి పంపారు”అని కోహ్లీ అన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు. అయితే మొన్న కోహ్లీ వాటర్ బాయ్ అంటే.. ఇప్పుడు కోహ్లీకి కౌంటర్ ఇచ్చాడు ముసిర్ ఖాన్.
2016 తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కి చేరుకుంది. అయితే 2014 తరువాత పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్ కి చేరుకుంది. అయితే రెండు జట్లు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. బెంగళూరు జట్లు పంజాబ్ కంటే కాస్త అధిక బలం కలిగి ఉంది. మొన్న పంజాబ్ ని 101 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. బెంగళూరు బౌలర్లు మరోసారి రెచ్చిపోతే.. టైటిల్ సాధించడం చాలా సులభం అంటున్నారు. మొన్న ముంబై ని చిత్తు చేసిన పంజాబ్ నేడు ఆర్సీబీ ని కూడా చిత్తు చేస్తుందని పంజాబ్ అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి అదృష్టం కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది కేకేఆర్ కి కెప్టెన్ గా వ్యవహరించి ట్రోఫీని అందించాడు. ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ కి ట్రోఫీ అందిస్తాడని అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఫైనల్ మ్యాచ్ కి ముందు ముషీర్ ఖాన్ విరాట్ కోహ్లీ పరువు తీశాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడం విశేషం.
Musheer Khan who was mocked by Virat Kohli as a waterboy was seen doing the action of lifting the ipl trophy yesterday.
~ Will Musheer do the same tonight, What's your take on this 🤔 pic.twitter.com/kqUOvKbleo
— Richard Kettleborough (@RichKettle07) June 3, 2025