BigTV English

New York: న్యూయార్క్‌ నగరంలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

New York: న్యూయార్క్‌ నగరంలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

New York: అగ్ర దేశం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.


తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి పథం వైపు నడుస్తోందని ఎన్ఆర్ఐలు అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆకాంక్షించారు. సింగర్స్ తమ ఆటా పాటతో ఉత్సవాలను ఆకర్షించేలా చేశారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ అలరించారు. బాలోత్సవ్‌ లో భాగంగా ఎన్ఆర్ఐల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి సందడి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు నిర్వహించడంతో ఉత్సవాలు అట్రెక్షన్ గా మారాయి. విజేతలకు నైటా తరఫున బహుమతులు అందించారు. అలాగే నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గ సభ్యులు చేసిన ఏర్పాట్లతో వేడుకలు చాలా అట్టహాసంగా జరిగాయి.

ALSO READ: Telangana: హైదరాబాద్‌లో 80 ఎకరాల్లో ఎకోటౌన్.. ఇది వచ్చిందంటే?


కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×