E-Paper
Advertisement

T20 World Cup 2026: బీసీసీఐపై కుట్ర‌లు..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లు?

T20 World Cup 2026: బీసీసీఐపై కుట్ర‌లు..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లు?

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ తో కలిసి పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెర లేపినట్లు వస్తున్నాయి. ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్లు నిర్వహించుకోవచ్చు అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. ఇప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓకే చెబితే, బంగ్లాదేశ్ కోసం స్టేడియాలు సిద్ధం చేస్తామని కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. శ్రీలంకలో తమతో పాటు బంగ్లాదేశ్ మ్యాచ్ లు నిర్వహించడానికి వీలుకాకపోతే పాకిస్తాన్ స్టేడియాలను వాడుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు సంచలన ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదన వైరల్ గా మారింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

పాకిస్తాన్ లో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మ్యాచ్ లు ?

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. వారంలో కనీసం ముగ్గురు హిందువులు చనిపోతున్నారు. అక్కడ ముస్లింలు కావాలనే టార్గెట్ చేసి , చంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎవరు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది.

అయితే దీనికి కౌంటర్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) కోసం తాము ఇండియాకు రాబోమని వెల్లడించింది. తమకోసం ఇండియా కాకుండా ఇతర వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించాలని సరికొత్త డిమాండ్ చేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board ). అయితే దీనిపై ఐసీసీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అంటే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇండియాకు వచ్చి బంగ్లాదేశ్ ప్రతి మ్యాచ్ ఆడాల్సిందేనని ఐసీసీ ( ICC) చెప్పగానే చెబుతుందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. శ్రీలంక అలాగే ఇండియాలో బంగ్లాదేశ్ కు సంబంధించిన మ్యాచ్ లు నిర్వహించడానికి వీలు కాకపోతే పాకిస్తాన్ స్టేడియాలను వాడుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఐసీసీకి ప్రతిపాదనలు పంపిందట.

ఐపీఎల్ 2026 పై బంగ్లాదేశ్ బ్యాన్

ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్ ను ఐపీఎల్ 2026 లో ఆడించ‌కుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో బంగ్లాదేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్ 2026 ప్ర‌సారాల‌ పై బంగ్లాదేశ్ బ్యాన్ వేసింది. ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చింది.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×