Road Accident: మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం చేటుచేసుకుంది. వ్యానును ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణ్ పుర్ సమీపంలో భావపుర గ్రామం నుండి ఓ కుటుంబం అంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సిమెంట్ లోడుతో ఉన్న ట్రక్కు అదుపు తప్పి వ్యాన్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
మృతులు వివరాలు.. ముఖేష్ (వయస్సు 40), సావ్లి (35) , వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ భారు బమానియా (14), కాంత (14 ), రాగిణి (9 ), అకాలి (35 ) ప్రమాదంలో మరణించారు. పాయల్ సోమ్లా పర్మార్ (19 సంవత్సరాలు) అషు (5 ) గాయపడ్డారు.
Also Read: ఇంటి సమీపంలో దారుణం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ హత్య
ఇదిలా ఉంటే.. ఓ ప్రైవేటు ట్రైవెల్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో.. ఎదురుగా ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ఘటన లో బస్సు డ్రైవర్, ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.