Pro Kabaddi League: ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ లో ప్లే ఆఫ్ ముంగిట తెలుగు టైటాన్స్ తడబడింది. లీగ్ లో పదవ ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ {Pro Kabaddi League} లో తెలుగు టైటాన్స్ ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పాట్నా పైరేట్స్ 41 – 37 తో తెలుగు టైటాన్స్ ని ఓడించింది. ఈ గెలుపుతో పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ కి చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆరంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
Also Read: Team India WTC Schedule: WTC 2025-2027 టోర్నమెంట్ టీమిండియా షెడ్యూల్ ఇదే ?
ఫస్ట్ హాఫ్ లో పాట్నా పైరేట్స్ ను ఒకసారి ఆల్ అవుట్ చేసినా.. తెలుగు టైటాన్స్ 18 – 19 తో వెనుకంజలో నిలిచింది. ఆ తరువాత సెకండ్ హాఫ్ లో ఇరుజట్లు పోటాపోటీగా తలపడ్డాయి. చెరో పాయింట్ తో మ్యాచ్ రసవత్తరంగా మారింది. కీలక సమయంలో తెలుగు టైటాన్స్ ని ఆల్ అవుట్ చేసింది పాట్నా. ఇక పాట్నా జట్టులో దేవాంక్ దళాల్ 14 పాయింట్లు సాధించాడు. దీంతో జట్టులో ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. {Pro Kabaddi League} ఇక తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ 8, విజయ్ మాలిక్ 9 పాయింట్లతో పోరాడినా ఫలితం దక్కలేదు.
ఈ మ్యాచ్ లో గెలుపుతో పాట్నా 73 పాయింట్లకు చేరింది. అంతేకాదు ఈ గెలుపుతో యూపీ ప్లే ఆఫ్స్ కి కూడా చేరుకుంది. ఇక ఇప్పటికే హర్యానా, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి చేరాయి. ఇప్పటివరకు 21 మ్యాచ్ లు ఆడిన హర్యానా 15 మ్యాచ్ లలో గెలుపొంది 79 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. {Pro Kabaddi League} పాట్నా 73 పాయింట్లతో రెండవ స్థానం, ఢిల్లీ 71 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక తెలుగు టైటాన్స్ 61 పాయింట్లతో ఏడవ స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఓటమి చెందడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
టాప్ 6 ప్లేస్ కోసం మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. అయితే చాలా సీజన్ల తర్వాత ఈ ఏడాది తెలుగు టైటాన్స్ మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ కీలక సమయంలో కెప్టెన్ పవన్ గాయంతో జట్టుకు దూరం కావడం వల్ల తెలుగు టైటాన్స్ ప్లే ఆప్స్ అవకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు తెలుగు టైటాన్స్ ప్లే ఆప్స్ కి చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి యూపీ యోధాస్ కూడా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టింది. ఇక తెలుగు టైటాన్స్ 21 మ్యాచ్ లలో 11 విజయాలు సాధించి, 10 మ్యాచ్ లలో ఓటమిపాలై 61 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ – తమిళ్ తలైవాస్ జట్లు తలపడ్డాయి. తమిళ్ తలైవాస్ 60 – 29 పాయింట్లు తేడాతో బెంగాల్ వారియర్స్ ని ఓడించింది. ఇక నేడు గుజరాత్ జెయింట్స్ తో యూపీ యోధాస్, యూ ముంబాతో పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి.