E-Paper
Advertisement

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌, న‌ఖ్వీ గాడిని ఉరి తీయాలంటూ ట్రోల్స్‌

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌, న‌ఖ్వీ గాడిని ఉరి తీయాలంటూ ట్రోల్స్‌
Advertisement

PSL 2027 SCHEDULE:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఏ నిర్ణయం తీసుకున్న ఈ మధ్య కాలంలో పెను సంచలనం అవుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) కోసం తమ జట్టును ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు మరో కుట్రకు తెర లేపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) వ్యూయర్షిప్ తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. ఐపీఎల్ 2027 ప్రారంభ సమయంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Pakistan Super League 2027 Tournament ) కూడా షురూ అయ్యేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఒకే సమయంలో ఇలా రెండు మెగా టోర్నమెంట్లు నిర్వహిస్తే… బీసీసీఐకి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. నవంబర్ మాసంలో మెగా వేలం కూడా జరగనుంది. ఇక మార్చి 15వ తేదీ నుంచి ఈసారి ఐపీఎల్ జరిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఐపిఎల్ 2026 కంటే 10 రోజులు ముందుగానే… ఐపీఎల్ 2027 ను ప్రారంభించాలని బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. మార్చి 15వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ నిర్వహించేలా స్కెచ్ వేసింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. అయితే ఒకేసారి ఇలా రెండు టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల…. విదేశాలలో ఉన్న అభిమానులు ఏ టోర్నమెంట్ చూడాలో అర్థం కాక గందరగోల పరిస్థితిని ఎదుర్కొంటారు. దానివల్ల ఐపీఎల్ వ్యూయర్షిప్ భారీగా తగ్గే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు దీనివల్ల పెద్దగా నష్టం ఉండదు… బీసీసీఐకి ( BCCI) ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని గ్రహించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ముందుకు సాగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

విదేశీ క్రికెటర్లకు బంపర్ ఆఫర్లు

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) సందర్భంగా.. పాకిస్తాన్ ను (Pakistan Team) దెబ్బకొడుతూ విదేశీ క్రికెటర్లను మన బీసీసీఐ (BCCI) ఎగరేసుకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఇండియాను దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్ ( Pakistan ) స్కెచ్ వేసింది. ఐపీఎల్ లో ఆడే విదేశీ క్రికెటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించి… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Pakistan Super League 2027 Tournament ) ఆడించేలా ప్లాన్ చేస్తోంది. విదేశీ క్రికెటర్లు ఎవరు వచ్చినా వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వడం… ఐపీఎల్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టింది. ల‌గ్జ‌రీ హోట‌ల్స్‌, కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చేందుకు కూడా దిగ‌జారింది పాక్‌.

Advertisement

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

Related News

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం

జింబాబ్వేలో అన్ని ఫ్లాట్ పిచ్ లే..అందుకే వైభ‌వ్ రెచ్చిపోయాడు

ఒక్క అర్ధ సెంచ‌రీతో పాకిస్తాన్ కుక్క‌ల నోర్లు వైభవ్ మూయించాడు

టీమిండియాకు ల‌క్ష్మ‌ణుడే శ్రీరామ ర‌క్ష‌..జింబాబ్వే ఓట‌మిపై శ్రీశాంత్ సంచ‌ల‌నం

ప్ర‌తీ బంతి 150 కి.మీ వేగమా? మాయంక్ యాద‌వ్ కు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

Big Stories

Advertisement
×