Hebah Patel: డెబ్యూ మూవీతోనే ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ అంతా ఆ తర్వాత ఈ క్రేజ్‌ను నిలబెట్టలేక కనుమరుగు అయిపోయారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం మళ్లీ డెబ్యూ మూవీ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయాలని ఆశపడుతున్నారు. వన్ మూవీ వండర్స్‌గా మిగిలిపోయిన హీరోయిన్స్ కూడా ఆశలు వదులుకోకుండా మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో హెబ్బా పటేల్ ఒకరు. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నా దాని తర్వాత తనకు సరైన హిట్ లేదు. తాజాగా తన ఆశలన్నీ ‘ఓదెల 2’పైనే ఉన్నా.. దాని వల్ల కూడా హెబ్బాకు దెబ్బేపడేలా ఉంది.
సైడ్ క్యారెక్టర్‌గా మారిందా.?
‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమా చాలారోజుల తర్వాత హెబ్బా పటేల్‌కు ఊహించని విజయాన్ని అందించింది. నేరుగా ఓటీటీలో విడుదలయిన ఈ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే దీనికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ సీక్వెల్ మరింత భారీ స్థాయిలో ఉండాలనే ఆలోచనతో తమన్నాను రంగంలోకి దించారు. ఒక శివశక్తి పాత్రలో తమన్నా కనిపిస్తుంది అనగానే ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ అదే సమయంలో హెబ్బా పటేల్‌కు అన్యాయం జరిగింది. మెయిన్ హీరోయిన్ కావాల్సిన తను.. సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. తాజాగా విడుదలయిన ట్రైలర్ చూస్తుంటే ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.
ట్రైలర్‌లో అంతే
తాజాగా ‘ఓదెల 2’ (Odela 2) ట్రైలర్ విడుదలయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ పార్ట్‌లో హీరోయిన్‌గా చేసిన హెబ్బా పటేల్ సీక్వెల్‌లో సైడ్ అయిపోయిందని అర్ధమవుతోంది. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో తను ఒకేఒక్క షాట్‌లో కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్‌లో తమన్నాకు సమానంగా హెబ్బా పటేల్ పాత్ర ఉంటుందని ఊహించారు. కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ చాలావరకు డిసప్పాయింట్ అయ్యారు. ఇక ట్రైలర్ చూస్తుంటే చాలావరకు ‘ఓదెల 2’ కథ అర్థమయిపోతుంది. హెబ్బా పటేల్.. తన భర్త పాత్రను చంపేయడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. ఆ భర్త దెయ్యంగా తిరిగి రావడంతో ఈ సీక్వెల్ కథ ప్రారంభమవుతుంది.
Also Read: ఓదెల 2 స్టోరీ ఇదే.. బిగ్ టీవీ ముందే చెప్పింది
రీజన్ ఏంటంటే.?
‘ఓదెల 2’లో హెబ్బా పటేల్ (Hebah Patel) భర్త దెయ్యంగా తిరిగి వస్తాడు. అలా తిరిగొచ్చిన తర్వాత తన చావుకు కారణమయిన హెబ్బానే ముందుగా చంపేస్తాడని తెలుస్తోంది. అందుకే ట్రైలర్‌లో తన గురించి పెద్దగా లేదని అర్థమవుతోంది. అంటే దాదాపుగా సినిమా స్టార్ట్ అవ్వగానే హెబ్బా పటేల్‌ను ఆ దెయ్యం కిరాతకంగా చంపేస్తుంది. అక్కడితో తన క్యారెక్టర్ ముగిసిపోతుంది. ఆ తర్వాత కథ అంతా శివశక్తిగా వచ్చిన తమన్నానే నడిపిస్తుంది. ఇక ఈ కథ అంతా రివీల్ అయిన తర్వాత ‘ఓదెల 2’లో హెబ్బా పటేల్‌ది దాదాపుగా గెస్ట్ రోల్ లాంటిదే అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న హెబ్బాకు దీని వల్ల పెద్దగా లాభం ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.