Rakul Preet Singh: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈ భామకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ సినిమా అనంతరం రకుల్ తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఎంతోమంది పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలలోనూ నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక రకుల్ గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.
Also Read : Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే
బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. ఇక ఈ భామ ప్రముఖ నటుడు జాకీ బాగ్నానీని ప్రేమించి వివాహం చేసుకుంది. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది వరుసగా సినిమాలలో నటిస్తోంది. వివాహం తర్వాత ఈ చిన్నదాని అందాల ఆరబోతకు హద్దు అదుపు ఉండడం లేదు. ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఇదిలా ఉండగా….రకుల్ ప్రీత్ సింగ్ టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ సెలబ్రిటీ అయినందున తాను ఏం చేసినా పెద్ద సంచలనమేనని రకుల్ అన్నారు. కోహ్లీ వల్లే అవనీత్ కౌర్ కు సోషల్ మీడియాలో రెండు మిలియన్ల ఫాలోవర్లు వచ్చారని ఆమె అన్నారు.
కోహ్లీని గెలికిన రకుల్ ప్రీత్ సింగ్
కోహ్లీ ఏం చేసినా దేశం అంతా తన వైపే చూస్తూ ఉంటుందని రకుల్ హాట్ కామెంట్స్ చేశారు. అవనీత్ పోస్టుకు కోహ్లీ తెలిసో తెలియకో లైక్ కొట్టారు. దానివల్ల అవినీత్ కౌర్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. అది చూసిన అనంతరం దేశంలో ఇంతమంది ఖాళీగా ఉన్నారా అని అనిపించిందని రకుల్ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ చిన్నది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రకుల్ ఇలా మాట్లాడటం చూసి కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఓవరాక్షన్ చేస్తుంది.. ఆమె బండారం విప్పుతే.. కాపురాలే కూలిపోతాయంటూ… కోహ్లీ అభిమానులు రెచ్చిపోతున్నారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. విరాట్ కోహ్లీ అభిమానులు అసలే ఓవర్గా రియాక్ట్ అవుతారు. అలాంటిది రకుల్ ఇలా గెలికితే ఊరుకుంటారా..? ఆమెకు వేధింపులు తప్పవని మరికొంతమంది చెబుతున్నారు.