E-Paper
Advertisement

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి
Advertisement

Ramiz Raja On IND VS PAK Asian Games 2026:  ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ లో భాగంగా అక్టోబర్ ఒకటవ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను దెబ్బ కొట్టేందుకు ఇదే మంచి సమయం… మళ్లీ మళ్లీ ఈ ఛాన్స్ రాదు, జపాన్ లోనే టీమిండియాను చిత్తుగా ఓడించాలని పాకిస్తాన్ జట్టుకు పిలుపునిచ్చాడు. జపాన్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ 100% జరుగుతుందని పేర్కొన్న ఆయన… అక్కడి మైదానాలు బౌలింగ్ కు అనుకూలిస్తాయని తెలిపారు. ఫ్లాట్ ట్రాక్ లు అస్సలు ఉండబోవు… జపాన్ తో జరిగిన మ్యాచ్ లోను ఇదే రుజువు అయిందని తెలిపారు. ఇలాంటి క్రమంలో టీమిండియాను చిత్తుగా యంగ్ పాకిస్తాన్ ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆసియా క్రీడాలలో టీమిండియాను చిత్తుగా ఓడించవచ్చు – రమీజ్ రాజా 

ఆసియా క్రీడలలో భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ ఒకటో తేదీన జరుగుతుందని రమీజ్ రాజా వ్యాఖ్యానించారు. టీమిండియాపై పగ తీర్చుకోవడానికి ఇదే మంచి సమయమని తెలిపారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని తెలిపారు. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడానికి టీమిండియా ముప్ప తిప్పలు పడిందని వెల్లడించారు. ఇక్కడి మైదానాలు బౌలింగ్ కు అనుకూలిస్తాయి.. అందుకే టీమిండియా ఆటగాళ్లు తోక ముడిచారని వివరించారు. ఫ్లాట్ ట్రాక్స్ ఉంటేనే టీమ్ ఇండియా ఆటగాళ్లు రాణిస్తారని సెటైర్లు పేల్చారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

బ్యాటు పైకి బంతి వస్తేనే కొడతారు తప్ప… వీళ్ళు పీకిందేమీ లేదని పరువు తీశారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 సిరీస్ లలో టీమిండియా తేలిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు సిరీస్ లను కోల్పోయిన టీమ్ ఇండియా… కేవలం బౌలింగ్ పిచ్ ఉండడం వల్లే ఈ పరిస్థితిని కొని తెచ్చుకుందని వివరించారు. దీని అర్థం చేసుకొని పాకిస్తాన్ యంగ్ టీం… టీమిండియాను దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. మెరుగైన బౌలింగ్ వేసి…. టీమిండియా బ్యాటర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాలని దిశా నిర్దేశం చేశారు.

పాకిస్తాన్ కు గోల్డ్ తీసుకువస్తా… ఫర్హాన్ శపథం

Advertisement

ఆసియా క్రీడలలో భాగంగా పాకిస్తాన్ జట్టుకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన ధ్యేయం అన్నారు ఫర్హాన్. దీనికోసం టీమిండియాను ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చాలా బలంగా ఉందన్నారు. టీమిండియాతో మ్యాచ్ జరిగితే కచ్చితంగా ఓడించి.. జట్టును ముందుకు తీసుకువెళ్తానని వెల్లడించారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

వైభవ్ తుఫాన్ ను ఆపండి..లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుంది

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

Big Stories

Advertisement
×