Satyabhama Today Episode February 5th: నిన్నటి ఎపిసోడ్లో.. సత్య మీద కోపాన్ని పెంచే లాగా సంధ్య తో మాట్లాడుతాడు సంజయ్.. సంధ్యా సంజయ్ ని చూసి సత్య ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే మహదేవయ్య సత్యదగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరి మురిపాలని చూస్తుంటే నీకు కోపంగా ఉంది కదా వాళ్ళు ఇలా అవుతారని నువ్వు అసలు ఊహించలేదు కదా అవును నా కొడుకు దుర్మార్గుడే జల్సా లకు అలవాటు పడిన వాడే సంధ్య నువ్వు సంధ్య పై మోసపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఆ మోజు తిన్నాక వదిలేస్తాడు అనేసి మహాదేవయ్య సత్యతో మాట్లాడుతాడు. నీ చెల్లెలు సంతోషంగా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి లేకుంటే మాత్రం సంజయ్ క్రిష్ లాగా కాదు నేను ఎంత చెప్తే అంత కృషి అయితే ఎందుకు ఏమిటి అని అడుగుతాడు అదే సంజయ్ అయితే ఎందుకు అని అడగకుండానే చెప్పమన్న పని చేసి చూపిస్తాడు. నువ్వు ఎన్నికల నుంచి తప్పుకోవాలా అప్పుడే నీ చెల్లెలు సంతోషంగా ఉంటుంది. లేదంటే మాత్రం ఏమవుతుందో ఊహించలేను వాళ్ళకి ఇక్కడ ఉంటే సమస్యలు వస్తాయని హనీమునికి పంపిస్తాను వచ్చేటప్పుడు ఆ పక్షుల్లో ఒక పక్ష మాత్రమే ఇంటికి వస్తుంది మిగతా పక్షి గాల్లో కలిసిపోతుందని బెదిరిస్తాడు.ఇక మహాదేవయ్య దెబ్బకు బెదిరిపోయిన సత్య మూడు రోజుల్లో ఎలాగైనా సంధ్య, సంజయ్ ను విడగొట్టాలని అనుకుంటుంది. ఇక క్రిష్ కూడా సత్యకు నచ్చజేప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ సత్య మాత్రం అస్సలు ఊహించలేవు.. వాళ్ళ ఇద్దరినీ కలుసుకోనివ్వను అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంధ్యను ఎలాగైనా సత్యకు యాంటిగా మార్చాలని అనుకుంటుంది. అదే విధంగా సంధ్యను పిలిచి నగలను ఇచ్చి బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నాకెందుకు అత్తయ్యా అని సంధ్య అడిగితే ఆడది ఇలా అనకూడదు ఎంత అయినా నగలు కావాలి అని అడగాలి అని అంగరంగ వైభవంగా జరగాల్సిన మీ పెళ్లి పక్కన ఎవరూ లేకుండా జరిగిందని ఈ ముచ్చట అయినా తీర్చుకోనివ్వు అని చెప్తుంది.. ఇక సత్య భైరవి రూమ్ కు వస్తుంది. ఇవే నగలు నాకు చూపించి బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేశారు. నేను పడలేదు. ఇప్పుడు నా చెల్లెలును వేసే ప్రయత్నం చేస్తున్నారు. అని అనగానే.. భైరవి నాటకం మొదలు పెడుతుంది.. నేనేం చేసినా మీ అక్కకి ఇష్టం లేదులే అనేసి అక్కడి నుంచి బైరవి వెళ్ళిపోతుంది ఇక సత్యా సంధ్యను అలాంటిది నమ్మొద్దు నేను మాయ చేసి తన బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది అని అంటుంది అయితే దానికి సంధ్య మాత్రం నాకు పుట్టింటి వాళ్ళని దూరం చేసావు ఇప్పుడు అద్దంకి ప్రేమను కూడా దూరం చేయాలనుకుంటున్నావా నేను నీకు తోడు కోడల్ని కదా ఆ ప్రేమ వాళ్ళు నా మీద చూపిస్తే నువ్వు ఓర్వలేక పోతున్నావని సంధ్య సత్యను తిడుతుంది.
సంజయ్ సత్యకి గతంలో ఫొటోలు చూపించి సంధ్యని ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాను అని చెప్పాడని చెప్తుంది. సంధ్య ఎంతకీ నమ్మకపోవడంతో సంజయ్ ఫోన్ చెక్ చేయమని చెప్తుంది. ఒకవేళ అందులో ఏం లేకపోతే సంజయ్కి సారీ చెప్పాలని అంటుంది. సత్య సరే అంటుంది. బయట సంజయ్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే సంధ్య ఫోన్ తీసుకుంటుంది. చెక్ చేస్తా అంటే సంజయ్ వద్దని నీ ఫోన్ నేను ఎప్పుడూ చెక్ చేయలేదు అని అంటే సంధ్య తన ఫోన్ సంజయ్ చేతిలో పెట్టి నా ఫోన్ చూసుకో నీ ఫోన్ నేను వెరిఫై చేస్తానని అంటుంది. సంజయ్ చాలా టెన్షన్ పడతాడు. సంధ్య మొత్తం చెక్ చేసి అందులో ఏం లేకపోవడంతో సత్య చేతిలో పెట్టి ఇదిగో నువ్వు కూడా చెక్ చేయ్ అని ఇస్తుంది.. ఇక సంజయ్ మాత్రం సత్యకు పెద్ద షాకే ఇస్తాడు. నీకు చూపించిన తర్వాత నేను ఎందుకు ఇంకా ఫోటోలు ఉంచుతాను అనుకున్నావు పిచ్చి సత్య నిన్ను మా టార్గెట్ రీచ్ అయిన తర్వాత సంధి ని ఎలా వదిలేయాలో అలా వదిలించుకుంటాను అనేసి సంజయ్ సత్యకు వార్నింగ్ ఇస్తాడు..
సంధ్య భైరవికి నెయిల్ పాలీష్ పెడుతుంది. భైరవి ఎమోషనల్ అయినట్లు నటిస్తుంది. మీరు నన్ను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నా ముందు సత్య చెల్లివి అని అనుమానం ఉంది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అంటుంది. ఇక సంధ్య తన ముద్దు ముచ్చటగా గురించి పట్టించుకోమని అంటే భైరవి సంధ్యకి ముద్దు పెట్టి సరిపోతుందా ఇంకా పెట్టాలా అని అడుగుతుంది. దాంతో సంధ్య నేను ఫస్ట్నైట్ గురించి అడుగుతున్నా అని అంటుంది. భైరవి వెటకారంగా సంధ్యని చూస్తుంది. తర్వాత ఈ రోజు రాత్రికే కార్యం అని అంటుంది. మా అక్క ఏర్పాట్లు చేస్తుందా అని అంటే సత్య చేయదు అని సత్య మీద చాడీలు చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో సందికు సంజయ్ కు శోభనం ఏర్పాట్లు చేస్తుంది బైరవి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..