
Icc World Cup 2023 : ముంబై వాంఖేడి స్టేడియంలో టీమ్ ఇండియా కీలకపోరునకు సిద్ధమవుతోంది. అయితే విజయవంతంగా నడుస్తున్న టీమ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని అంటున్నారు. కాకపోతే నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 9 మంది బౌలింగ్ చేయడం నాకౌట్ ముందు ఆందోళన కలిగించే విషయమే.
స్పిన్ కు అనుకూలించే పిచ్ మీద ప్రారంభంలో పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అంటే రన్స్ తక్కువ ఇచ్చినా, వికెట్లు త్వరత్వరగా పడగొట్టలేకపోయారు. ఇదే సమయంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా చిన్న టీమ్ అయిన నెదర్లాండ్ ఆటగాళ్లు ఇండియా బౌలింగ్ ని అవలీలగా ఎదుర్కొన్నారు. 48 ఓవర్ల వరకు ఆడుతూ వెళ్లారు.
శ్రేయాస్, రాహుల్ తప్ప బ్యాట్స్ మెన్లు అందరూ బౌలింగ్ చేశారు. ఇదే పరిస్థితి రేపు సెమీస్ లో ఎదురైతే కివీస్ ఆటగాళ్లు చెలరేగిపోతారు. టీమ్ ఇండియాలో ఐదుగురు మెయిన్ బౌలర్స్ బుమ్రా, షమీ, సిరాజ్. జడేజా, కుల్దీప్ ఉన్నారు. వీరిలో ఒకరైనా ఫెయిల్ అయితే, వారి ప్లేస్ లో ఆరో బౌలర్ గా అశ్విన్ ను తీసుకురావాలని జట్టు ఆలోచనగా ఉంది.
మరోవైపు టాప్ ఆర్డర్ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉంది. ఓపెనర్లు గిల్, రోహిత్ బ్రహ్మాండమైన బిగినింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ డౌన్ కొహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తర్వాత శ్రేయాస్, రాహుల్ కూడా బీభత్సంగా ఆడుతున్నారు. అందువల్ల సూర్య ఉపయోగం పెద్దగా ఉండటం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. కాకపోతే ఇంగ్లండ్ మ్యాచ్ లోనే సూర్యకి అవకాశం వచ్చింది. దానిని తను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు సెమీస్ లో అలాంటి పరిస్థితే ఎదురైతే? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు టీమ్ ఇండియా ముందు, ఇది పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకుండా అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్ననేపథ్యంలో వారికి చెక్‌పెట్టేందుకు టీమిండియా వ్యూహాత్మక మార్పు చేసే అవకాశాలున్నాయి. కానీ అలా చేస్తే బ్యాటింగ్ విభాగం బలహీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఛాన్స్ తీసుకోలేమని అంటున్నారు. ఒకవేళ బౌలింగ్ లో ఆరుగురు ఉంటే, కివీస్ ని త్వరగా అవుట్ చేసేందుకు, ముప్పేట దాడిచేసేందుకు అవకాశం ఉంటుందని మరో వాదన వినిపిస్తోంది.
Harsha Bhogle : పంచ్ అంటే.. అలా తగలాలి పాక్ నెటిజన్ కి.. హర్షాభోగ్లే ఒకటిచ్చాడు..