BigTV English
Advertisement

Weight Loss : ఈ డ్రై ఫ్రూట్స్‌తో బరువు వేగంగా తగ్గుతారు..!

Weight Loss : ఈ డ్రై ఫ్రూట్స్‌తో బరువు వేగంగా తగ్గుతారు..!
weight loss diet

Weight Loss Dry Fruits (health news in telugu):


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమస్య అధిక బరువు. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గేందుకు నానాపాట్లు పడుతున్నారు. అయితే బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యేమి కాదు. మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బరువును సులభంగా తగ్గించొచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మీ ఆహారంలో బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష చేర్చుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు పొందొచ్చు. బరువు తగ్గాలను కునే వారు వైట్‌రైస్‌ను తీసుకోకపోవడం మంచిది. వైట్‌రైస్ బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎక్కువగా ఆకలి అనిపించదు. ఇవి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కేలరీల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.


Read More : ఇవి తిన్నారంటే.. మీ ఇమ్యూనిటీ పైపైకే..!

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. ఎముకలు, జ్ఞాపకశక్తి, జట్టు,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. మీ మెదడును కూడా చురుకుగా ఉంచుతాయి.

డ్రై ఫ్రూట్స్ యొక్క ప్రయోజనాలు

డ్రై ఫ్రూట్స్ సంతృప్తి కలిగించే లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా అతిగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. శరీరానికి అవసరమైన పోషకాలను, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ని అందిస్తాయి.

బాదం, వాల్‌నట్స్ అతిగా ఆహారం తినడాన్ని నియంత్రిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెరుగైన జీవక్రియకు దోహదపడతాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.

బరువు తగ్గించే డ్రై ఫ్రూట్స్

బాదం

బాదంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నిండుగా ఉంటాయి. ఇవి ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి. బాదం కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అలానే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. నానబెట్టిన లేదా కాల్చిన బాదాన్ని ఆహారంలో తీసుకోవండి.

చియా గింజలు

చియా గింజలు ఆకలిని అదుపులో ఉంచుతాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. చియా గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు,మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియకు,పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

Read More : ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారా..!

ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్ష సహజమైన తీపిని అందిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆకలిని, అతిగా తినాడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.

సీవీడ్ స్నాక్స్

సీవీడ్ స్నాక్స్‌లో తక్కువ కేలరీలను, అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బరువు నిర్వహణకు తోడ్పడే
సంతృప్తికరమైన క్రంచ్‌ను కలిగుంటాయి.

ఎండబెట్టిన టొమాటోలు

ఎండలో ఎండబెట్టిన టమోటాలో కేలరీలు తక్కువగా..యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అదనపు కేలరీలను జోడించకుండా వంటల రుచిని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గేందుకు మీ వంటల్లో వీటిని వాడండి.

Disclaimer : ఈ కథనం పలు మెడికల్ జర్నల్స్, వైద్య అధ్యయనాల ఆధారంగా రూపొందించబడిన సమాచారం మాత్రమే.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×