BigTV English
Advertisement

RCB Fan Trolls CSK: ధోనికి ఖైదీ జెర్సీ… CSK చీటింగ్ టీం అంటూ RCB కుట్ర !

RCB Fan Trolls CSK: ధోనికి ఖైదీ జెర్సీ… CSK చీటింగ్ టీం అంటూ RCB కుట్ర !

RCB Fan Trolls CSK: టీమిండియా కు ఎన్నో విజయాలను అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్యారెక్టర్ పై… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేసిన తప్పిదానికి… మహేంద్ర సింగ్ ధోని ని బలి పశువు చేస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో జరిగిన తప్పిదాలను ఇప్పుడు గుర్తు చేస్తూ… మహేంద్ర సింగ్ ధోనీ పై నిందలు వేస్తున్నారు.


Also Read: Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైన రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించారు. దీంతో 2016 అలాగే 2017 సంవత్సరాలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు… చెన్నై సూపర్ కింగ్స్ దూరమైంది. ఆ రెండు సంవత్సరాల పాటు రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోని.


చెన్నై జెర్సీపై ట్రోలింగ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై 2016 అలాగే 2015 సీజన్లలో బ్యాన్ విధించిన విషయాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ రెండు సీజన్ లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ లందరూ జైల్లో ఉండాలని… చురకలాంటిస్తున్నారు. నిజంగానే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు జైల్లో ఉంటే వాళ్లకు ఖైదీల జెర్సీలు వచ్చే వంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రాయల్ చాలెంజర్ అభిమాని అయితే.. చెన్నై ప్లేయర్లు ఖైదీ డ్రెస్ వేసుకోవాలని.. చూపిస్తూ గ్రౌండ్లో రచ్చ చేశాడు.

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై… మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క కప్పు గెలవలేదు.. కానీ ఓవర్ యాక్టింగ్ చేస్తూ రచ్చ చేస్తుందని… చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టైటిల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందు… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పిల్ల బచ్చా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. 18 సంవత్సరాలుగా కప్పు గెలవలేదు.. ఇకనైనా కప్పు గెలిచి చూపించండి రా.. అంటూ చెన్నై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్.. ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో… దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 5 ఓటములను చవిచూసింది.. కేవలం రెండు మ్యాచ్ల్లోనే గెలిచి… పాయింట్లు పట్టికలో పదవ స్థానానికి పరిమితమైంది. నిన్న ధోని కెప్టెన్సీలో… చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే RCB ఫ్యాన్స్ దారుణంగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Virat Kohli: RCB కోసం యువ జంట రచ్చ.. తిరుమల మెట్లు ఎక్కి మరీ

Related News

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Big Stories

×