RCB Fandom: ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {Indian Premier League} ఐపీఎల్) 2025 సీజన్ కి ముహూర్తం ఖరారు అయ్యింది. మార్చి 21వ తేదీ నుండి ఈ మహా సమరం ప్రారంభం కాబోతోందని ఇటీవల ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఈసారి కప్ కైవసం చేసుకునేందుకు అన్ని జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఐపీఎల్ లో మోస్ట్ ఫెయిల్యూర్ టీమ్ ఎవరంటే టక్కున గుర్తు వచ్చే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు { Royal Challengers Bengaluru} (ఆర్సిబి).
Also Read: Ind vs Eng, 4th T20I: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..రింకూ ఇన్.. షమీ అవుట్ !
కానీ ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. గత 17 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ జట్టు దురదృష్టాన్ని తన జేబులో పెట్టుకుని తిరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ వరకు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఒక్కసారి కూడా ఛాంపియన్ గా నిలవలేకపోయింది. 2009, 2011, 2016.. ఈ మూడు సీజన్లలో ఫైనల్ వరకు వచ్చి ఓటమిపాలైంది.
మొదటిసారి డెక్కన్ చార్జర్స్, రెండవసారి చెన్నై సూపర్ కింగ్స్, మూడవసారి సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత మళ్లీ ఫైనల్ మొహం చూడలేదు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఫ్యాన్ బేస్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇది ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే పోతుంది. “ఈ సాలా కప్ నమ్దే” అంటూ ఐపీఎల్ సీజన్ వచ్చిన ప్రతిసారి ఆర్సిబి ఫ్యాన్స్ ఈ టాపిక్ తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. 2024 వ సీజన్ లో కూడా ఆర్సీబీకి నిరాశే ఎదురైంది.
ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిని చవిచూసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అంచనాలకు ఏమాత్రం కొదవలేని ఈ జట్టు కప్పు గెలవడంలో మాత్రం ప్రతిసారి బోల్తా కొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సిబి ఎలాగైనా ఐపీఎల్ 2025 లో ట్రోఫీ కొట్టాలని అభిమానులు రకరకాల పూజలు చేస్తున్నారు. ఇటీవల కుంభమేళాలో ఓ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమాని ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.
ఆర్సిబి జట్టుకు సంబంధించిన జెర్సీని మహా కుంభమేళాలో ముంచి.. ఈసారి కప్ కొట్టాలని పూజలు చేశాడు. ఇక తెలుగు రాష్ట్రానికి చెందిన మరో అభిమాని ఆర్సిబి ఈసారి కొట్టాలని ఓ ప్లెక్సీ తో పాదయాత్రగా శబరిమల వెళుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా మరో అభిమాని ఆర్సిబి ఐపీఎల్ 2025లో కొట్టాలని కోరుతూ తన కూతురి పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు.
Also Read: Champions Trophy 2025: ఆ రోజునే దుబాయ్ కి టీమిండియా..రిచ్ హోటల్ లోనే బస !
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మహిళా జట్టు, అలాగే పురుషుల జట్టు ఫోటోలు ముందు ఉంచి తన కూతురు మొదటి సంవత్సర పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు. ఇందులో ఐపీఎల్ కప్ ని సైతం ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆ డెకరేషన్, ఆ పుట్టినరోజు వేడుకలు వేరే లెవెల్ అంటూ ఆర్సిబి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">