BigTV English

RCB: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు.. చిన్న స్వామి ఘటనపై RCB మరో షాకింగ్ పోస్ట్

RCB: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు.. చిన్న స్వామి ఘటనపై RCB మరో షాకింగ్ పోస్ట్

RCB: 2025 ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} టైటిల్ గెలిచిన తర్వాత ఓ విషాదకర సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సిబి విజయోత్సవ సంబరాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జూన్ 4వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కీసలాటలో 11 మంది చనిపోయారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కీసలాట చోటుచేసుకుంది.


Also Read: Shami Wife Hasin: ‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య వివాదాస్పద పోస్ట్

అయితే ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యం తాజాగా ఈ ఘటనపై స్పందించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్సిబి యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ఆర్సిబి కేర్స్ చొరవతో ఫ్రాంచైజీ ఆగస్టు 30 ఈ విషయం గురించి ప్రకటించింది. ” 2025 జూన్ 4న మా హృదయాలు విరిగిపోయాయి. మేము ఆర్సిబి కుటుంబంలోని 11 మంది సభ్యులను కోల్పోయాం.


వారు మనలో భాగమే. మన నగరాన్ని, మన సమాజాన్ని, మన జట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వారి భాగం ఎంతగానో ఉంది. వారు ప్రస్తుతం మనలో లేకపోవడం మనలో ప్రతి ఒక్కరి జ్ఞాపకాలలో ప్రతిధ్వనిస్తుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేము. కానీ మొదటి అడుగుగా.. అత్యంత గౌరవంతో ఆర్సిబి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున అందించింది”. అని ట్విట్ చేసింది.

అయితే ఇంతకుముందు బాధిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది ఆర్సిబి యాజమాన్యం. ఆర్సిబి కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేసి గాయపడిన వారికి సాయం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పుడు నష్టపరిహారాన్ని రూ. 25 లక్షలుగా ప్రకటించడం గమనార్హం. ఇక గాయపడిన వారికి ఏ మేరకు సాయం చేస్తారన్నది వేచి చూడాలి. ఇక ఈ తొక్కీసలాట ఘటన జరిగిన తర్వాత జూన్ 5న పోస్ట్ చేసిన ఆర్సిబి.. దాదాపు 80 రోజులపాటు సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేయలేదు. ఇటీవల అభిమానుల సంక్షేమం కోసం ఆర్సిబి కేర్స్ ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: Asia Cup 2025: ఆసియా కప్ కంటే ముందే టీమిండియా ప్లేయర్లకు గంభీర్ అగ్నిపరీక్ష… సెప్టెంబర్ 5 నుంచి ఆట షురూ

అభిమానుల యోగక్షేమాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఆర్సిబి కేర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషాద బాధను మూడు నెలలుగా మౌనంగా అనుభవించామని.. దాని నుండి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపింది ఆర్సిబి. ఆ విషాదకర ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని.. అభిమానులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేసింది. అందుకోసమే అభిమానుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆర్సిబి కేర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. చెప్పిన విధంగానే తాజాగా ఆర్సిబి కేర్స్ చొరవతో తొక్కీసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షల నష్టపరిహారాన్ని అందించింది.

Related News

BCCI – Dhoni : గంభీర్ పోస్ట్ గల్లంతు.. ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

Rahul Dravid Quits: రాజస్థాన్ నుంచి ద్రవిడ్ అవుట్… రంగంలోకి బ్రెట్ లీ ?

Watch Video : ఆఫ్ఘనిస్తాన్ లో కలకలం…. ఒకే దగ్గర లక్షమంది.. క్రికెట్ అంటే ప్రాణమిచ్చేలాగా ఉన్నారే

Digvesh Rathi Fined: దిగ్వేష్ దూల తీరింది…. నితీష్ తో గొడవపై భారీ ఫైన్

Tesla – Team India : టీమిండియా స్పాన్సర్ గా టెస్లా… రంగంలోకి ఎలాన్ మాస్క్ ?

Big Stories

×