Rahul Dravid-RCB : ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఒక్క టైటిల్ సాధించకపోయినా అభిమానులు మాత్రం ఆ టీమ్ ని ఆదరిస్తూనే ఉన్నారు. 17 సంవత్సరాల తరువాత 2025 ఐపీఎల్ సీజన్ లో ట్రోఫీ సాధించింది ఆర్సీబీ. దీంతో అభిమానులు తెగ సంబురపడ్డారు. అనంతరం తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని 11 మంది మరణించడం విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. అయితే వచ్చే సీజన్ కి ఆర్సీబీకి కొత్త కోచ్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవ్వరో కాదండోయ్ రాహుల్ ద్రవిడ్.
Also Read : Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?
రాహుల్ రాజీనామా అందుకేనా..?
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన విషయం విధితమే. వాస్తవానికి 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్ కే తన పదవీకి రాజీనామా చేశాడు. ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ రాజీనామా చేసాడని కొందరూ.. మరికొందరూ మరోలా ఎవ్వరికీ తోచిన విధంగా వారు.. రకరకాల కారణాలు ఉన్నాయని చర్చించుకోవడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 కు ముందు రాహుల్ ద్రవిడ్ ను తమ జట్టు హెడ్ కోచ్ గా నియమించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కేకేఆర్ కి కూడా హెడ్ కోచ్ పదవీ ఖాళీ కావడంతో రాహుల్ ద్రవిడ్ ని హెడ్ కోచ్ గా నియమించుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఆర్సీబీకి హెడ్ కోచ్ గా ద్రవిడ్..?
దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ.. ద్రవిడ్ చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే ద్రవిడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే హెడ్ కోచ్ గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఐపీఎల్ తొలి సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించడం విశేషం. 2008, 2009, 2010 మూడు సీజన్లకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. తరువాత కోచ్ గా, హెడ్ కోచ్ గా అంచెలంచెలుగా ఎదిగాడు ద్రవిడ్. అయితే వరల్డ్ కప్ రావాలని పోరాడినప్పటికీ అతని హయాంలో టీమిండియాకి వరల్డ్ కప్ రాలేదు. 2002లో గంగూలీ కెప్టెన్సీలో రాహుల్ ద్రవిడ్, యువరాజ్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫైనల్ వరకు తీసుకెళ్లారు. మరోవైపు టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ ను గోడలాగా పాతుకుపోతాడనే పేరు ఉంది. అండర్ -19 జట్టుకు కోచ్ గా వ్యవహరించిన సమయంలో టీమిండియాకి వరల్డ్ కప్ కూడా లభించింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండేందుకు ఆసక్తి కనబరుస్తాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.