Big Stories

Kalvakuntla Family Scams: ఇంటిపేరు కల్వకుంట్ల.. స్కాములకు కేరాఫ్ అడ్రసంట..!

- Advertisement -

KCR Family Scams: కల్వకుంట్ల.. ఈ ఇంటి పేరు తెలంగాణలో తెలియని వారుండరు. తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన.. సారీ.. స్మాల్‌ కరెక్షన్.. ఏలిన పెద్దల ఇంటిపేరు ఇది. ఇది ఆరోపణ కాదు.. ఆక్రోశం అంతకన్నా కాదు.. ఏ స్కామ్‌ తీగ లాగితే.. డొంకంతా వారి ఇళ్ల వద్దనే కదులుతుంది మరి. ఒక్కొక్క స్కామ్‌లో బయటపడుతున్న వారి పేర్ల ముందు ఉన్న సర్‌ నేమ్ ఇదే. అయితే వారు.. లేదంటే వారి కుటుంబ సభ్యులు.. ఇంతకీ ఈ కేసులేంటి? కల్వకుంట్ల స్కామ్‌లేంటి?

- Advertisement -

ముందుగా మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్‌రావు సీన్‌ ఏంటో చూద్దాం. కేసీఆర్‌, హరీష్‌రావు అంటే ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గుర్తొచ్చేది.మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మించి తానే డిజైన్లు గీశానని చెప్పుకున్న కేసీఆర్.. దగ్గరుండి తానే కట్టించానని చెప్పుకున్న హరీష్‌రావు.. ఇద్దరు సైలెంట్ అయిపోయారు. మేడిగడ్డ కుంగిపోవడాన్ని తక్కువ చేసి చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకు కుంగిందన్న దానికి మాత్రం సమాధానం చెప్పే ధైర్యం చేయడం లేదు. అంచనాలను 80 వేల కోట్ల నుంచి.. లక్షన్నర కోట్లకు తీసుకెళ్లారు. హడావుడిగా నిర్మించారు. ఇంత పెట్టి నిర్మిస్తే మూడేళ్లు కాకముందే కుంగిపోయింది. మరీ నిర్మాణంలో నిజంగానే అంత డబ్బు ఉపయోగించారా? కమీషన్ల కోసం నాణ్యత విషయంలో రాజీ పడ్డారా? ఆ డబ్బంతా కాంట్రాక్టర్లు, నేతల జేబుల్లోకే వెళ్లిందా? ఇప్పుడివే డౌట్స్‌తో విచారణ జరుగుతోంది. అటు ఏసీబీ, ఇటు NDSA లెక్కలు తీస్తున్నాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు పెద్దల మెడకు.. ఈ కేసు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ, క్రియ.. ఈ ఇద్దరు నేతలే. ఇది మనం ఇప్పుడేదో కొత్తగా చేస్తున్న ఆరోపణ కాదు. ఈ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ మొత్తం ఈ ఇద్దరు నేతలే తీసుకున్నారు. మరి తేడా వచ్చినా వారే కదా ముందుండి బాధ్యత తీసుకోవాల్సింది. ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్నా.. ఓడిన తర్వాత బోడి మల్లన్న అంటే నడవదు కదా.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త కోణం.. ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్

కల్వకుంట్ల కుటుంబంలో మరో స్కామ్‌ స్టార్.. సీఎం కేసీఆర్ ముద్దుల తనయ.. కల్వకుంట్ల కవిత. ఎంపీగా ఓడితే.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మరీ ఆదరించారు కేసీఆర్. మరి ఆమె ఏం చేసింది? తెలంగాణ ప్రజల కోసం కాకుండా.. కల్వకుంట్ల ఆర్థిక సామ్రాజ్య విస్తరణపై ఫోకస్ చేసింది. సౌత్‌ గ్రూప్‌ పేరుతో లాబీని క్రియేట్‌ చేసి.. ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో డీల్ సెట్ చేసింది. పాలసీలో మార్పులు.. వందల కోట్ల ముడుపులు.. వీటన్నింటి కర్త, కర్మ, క్రియ కవితే అంటోంది ఈడీ. స్టేట్‌ను తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు చూసుకుంటే.. నేషనల్ వైడ్‌గా ఆ బాధ్యతను కవిత చూసుకుంటోందన్న సెటైర్లు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అందుకే స్టేట్‌ పోలీసులు కాకుండా.. సెంట్రల్‌ ఏజెన్సీలే అరెస్ట్‌ చేశాయి. ఇప్పట్లో ఆమె బయటకు రావడం కష్టమేనన్న వాదన బీఆర్‌ఎస్ నేతల నుంచే వినిపిస్తోంది.

ఈ లిస్ట్‌లో లెటెస్ట్‌గా చేరిన మరో నేత, బీఆర్‌ఎస్‌ తెర వెనుక మంత్రాగం నడిపించే నేత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.. ఎంపీ సంతోష్‌ రావు. ఈయనపై కేసులు రిజిస్టర్‌ అయ్యేందుకు రీజన్ భూకబ్జాలు. ఏకంగా బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లోని ఓ ఖరీదైన ప్లేస్‌ను కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్‌ క్రియేట్‌ చేసి.. 1350 స్క్వేర్ ఫీట్ల భూమిని కబ్జా చేశారంటూ కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు డిటేయిల్స్‌లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 14 సర్వే నంబర్‌లో 129/54లో ఉంది ఈ ల్యాండ్. 2010లో కరణ్‌ దూబే, ఆయన వైఫ్‌ భారతి దూబే నుంచి. నవయుగ కంపెనీ కొనుగోలు చేసింది. లాస్ట్ ఇయర్‌ నవంబర్‌లో కూడా ఈ ప్రాపర్టీ నవయుగ పేరుమీదే ఉంది. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అది తమ భూమి అంటూ GHMCకి జోగినిపల్లి సంతోష్‌రావు.. లింగారెడ్డి శ్రీధర్‌ ట్యాక్స్ కడుతుండడంతో నవయుక కంపెనీ షాక్ అయ్యింది. తమ ల్యాండ్‌ కబ్జా అయ్యిందని గుర్తించి న్యాయం చేయండి అంటూ పీఎస్‌ గడప తొక్కింది. సంతోష్‌ అండ్ శ్రీధర్‌పై 420, 468, 471, 447 కింద కేసు నమోదు చేశారు. అంతా తూచ్‌.. అది లీగల్‌గా కొన్న ల్యాండ్ అంటూ సంతోష్‌రావు చెబుతున్నా.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై మాత్రం ఎన్నో అనుమానాలు. ఎప్పుడు నవయుగ కొనుకున్న ల్యాండ్‌ మళ్లీ సంతోష్‌రావుకు ఎలా అమ్ముతారన్నదే మెయిన్ క్వశ్చన్‌. దీన్నే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

Also Read: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..

తన కన్ను పడితే.. ఆ భూమి కబ్జానే.. అన్న తీరుగా వ్యవహరించిన మరో వ్యక్తి.. కల్వకుంట్ల తేజేశ్వర్.. అలియాస్ కన్నారావు. ఈ పెద్ద మనిషి మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు.. ఈయనపై లెటెస్ట్‌గా భూకబ్జా కేసు ఫైల్ అయ్యింది. ఆదిభట్లలో ఓ ల్యాండ్‌పై కన్ను పడడంతో ఆక్రమించకోవడానికి స్కెచ్ వేశారు. ఆ సైట్ దగ్గర నానా బీభత్సం సృష్టించారు. ఫెన్సింగ్ ధ్వంసం చేశారు.. అక్కడున్న బ్లూషీట్స్‌కు నిప్పు పెట్టారు. అక్కడున్న గోడలను కూల్చేశారు. కన్నారావు కనుసైగ చేస్తేనే ఇదంతా జరిగిందనేది బాధితుల మాట. బాధితులు కన్నారావుతో పాటు.. ఏకంగా 35 మంది బీఆర్ఎస్‌ నేతలపై కేసు ఫైల్ చేశారు. కేసు నమోదవుడంతో పరారయ్యాడు కన్నారావు.. ఆయన అనుచరులను మాత్రం పోలీసులు ఇప్పటికే లోపల వేశారు.. కన్నారావు దొరికితే ఆయన కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే.

ఇది జోగినపల్లి సంతోష్‌రావు, కల్వకుంట్ల కన్నారావు ల్యాండ్ ఫైల్స్. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీలో నెంబర్‌ టూ.. జూనియర్‌ సీఎంగా పేరు గాంచిన కేటీఆర్‌పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌ విషయంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారన్నది మెయిన్ అలిగేషన్. ఈ టెండర్‌ లీజ్‌ను ఏకంగా 30 ఏళ్లకు ఐఆర్‌బీ కంపెనీకి వెళ్లడం వెనుక.. చాలా పెద్ద స్కామే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. 30 ఏళ్ల కాలానికి కేవలం 7 వేల 380 కోట్లకే.. ఎలా కట్టబపెట్టారు? ఎందుకు కట్టబెట్టారు? అనే దానిపై చాలా పెద్ద దుమారమే రేగింది. కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఈ కాంట్రాక్ట్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం రేవంత్ సర్కార్‌ దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టోల్ టెండర్ల అవకతవకలపై ఇన్వెస్టిగేషన్‌ చేయాలని ఆర్డర్స్‌ చేశారు సీఎం రేవంత్. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారు ? ఎవరి ప్రమేయంతో ఇది జరిగింది? ఏయే సంస్థలున్నాయి? ఎవరు బాధ్యులు? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలన్నారు. ఈ ఆరోపణలకు తగ్గట్టు ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. నిజానికి గతంలో ఈగిల్ సంస్థ ఓఆర్‌ఆర్‌ టోల్‌ను వసూలు చేసేది. అప్పుడు నెలకు 40 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు 60 కోట్లకు పైనే వస్తోంది. గతంతో పోలిస్తే ఆదాయం ఎందుకు పెరిగింది? అంటే గతంలో కూడా ఇలానే ఆదాయం ఎక్కువ వచ్చిందా? ఆ వచ్చిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇప్పుడీ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ వెతికే పనిలో ఉన్నారు అధికారులు.

Also Read: ఏపీ అసెంబ్లీ బరిలో 8 మంది మాజీ సీఎంల వారసులు.. ఎవరెవరంటే..?

నాటో ఓన్లీ ORR.. కేటీఆర్‌పై అలిగేషన్స్ వచ్చిన మరో ఇష్యూ.. ఈ-ఫార్ములా రేసింగ్. ఈ రేసింగ్ విషయంలో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్.. ప్రభుత్వాధికారుల నుంచి పర్మిషన్స్ రాకముందే రంగంలోకి దిగారు. ఆయన నోటి మాట మీదుగానే.. ఫండ్స్‌ రిలీజ్ చేశారు. అందుకే ఈ లీజ్ రద్దు కాగానే ఆయన నెత్తి, నోరు బాదుకున్నారు. హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. దీంతో అసలు విషయాలేంటా అని ఆరా తీస్తే.. అప్పటి HMDA కమిషనర్ అరవింద్‌ కుమార్ చెప్పిన విషయాలు కాస్త షాక్ ఇచ్చాయి. ఈ రేసింగ్‌ కోసం ఒప్పందం కుదర్చింది కేటీఆర్. ప్రమోటర్స్‌ ఎవరూ ముందుకు రాకపోతే.. HMDAకు ఆ బాధ్యతలు అప్పగించింది కేటీఆర్. ఇప్పుడీ అంశంపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.

ఇలా లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌, హరీశ్‌రావు.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత.. ల్యాండ్ స్కామ్‌లో సంతోష్‌.. భూకబ్జా కేసుల్లో కన్నారావు.. ఓఆర్‌ఆర్ టెండర్స్… ఈ ఫార్ములా రేస్‌లో కేటీఆర్‌. ఒక్కొక్కరు ఒక్కో కేసులో ఉన్నారు.. మొత్తానికి కల్వకుంట్ల అంటే కుంభకోణం అనేలా ఉంది పరిస్థితి. బంగారు తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బీఆర్‌ఎస్‌ పెద్దలు ఎత్తుకున్న నినాదం. పదేళ్ల పాలన తర్వాత తెలంగాణ ఎంత బంగారుమయమైందో తెలీదు కానీ.. కొందరు నేతలు మాత్రం అందుకోలేనంత ఎత్తుకి ఎదిగారు. వారు అడిందే ఆట.. పాడిందే పాట. అందినకాడికి దోచుకో.. వీలైనంత దాచుకో. ఇదే సిస్టమ్‌ కొనసాగినట్టు కనిపిస్తోంది. ఇప్పుడీ లెక్కలు బయటికి వచ్చే సమయం ఆసన్నమైనట్టుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News