BigTV English

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Cricketers: క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ ఉన్న గేమ్ అన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి క్రికెట్ కోసం రక రకాల స్టేడియాలు.. ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో… రకరకాల స్టేడియాలు ఉండగా… మరికొన్ని సరికొత్త అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు సంబంధించిన స్టేడియం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఈ స్టేడియంలో మెట్లపైనే… క్రికెటర్ల పేర్లు రాసి… వాళ్ల రికార్డుల వివరాలను పొందుపరిచారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.


Also Read:  Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే 

ఆస్ట్రేలియా స్టేడియంలో వింత సంఘటన.. మెట్లపైనే


ఆస్ట్రేలియాకు సంబంధించిన హోబార్ట్ స్టేడియం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ స్టేడియాన్ని నింజా స్టేడియం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ స్టేడియంలో… అద్భుతంగా ఆట ప్రదర్శన చేసిన.. ప్లేయర్లకు అరుదైన గౌరవం అందిస్తారు. వాళ్లకు అవార్డులు ఇవ్వడమే కాకుండా… వాళ్ల ఎదుగుదలను ఉద్దేశించి… ప్రత్యేకంగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో మెట్టు పైన ఒక్కో ఆటగాడి పేరు రాస్తున్నారు.

బాగా రాణించిన ప్లేయర్ల పేర్లను ఇక్కడ పొందుపరుస్తారు. బౌలర్ లేదా ఆల్రౌండర్.. అది కాకపోతే బెస్ట్ బ్యాట్స్మెన్ పేర్లను ఇందులో రూపొందించారు. ఇక ఈ ఫోటోలో చూపించినట్లు.. మొదటి మెట్టు పైన శ్రీలంకకు చెందిన రూమేష్ రత్నయాకే పేరు ఉంది. ఈ స్టేడియంలో ఇతను ఆరు వికెట్లు తీసి కేవలం 66 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు సంబంధించిన మైకెల్ స్లాటర్ 168 పరుగులు సాధించాడు. షన్ వార్న్ 31 పరుగులు ఇచ్చి ఆర్ వికెట్లు తీయడంతో అతనికి మూడవ స్టెప్ కేటాయించారు. ఇలా మెట్లన్నీ వాళ్ళ పేర్లతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

హోబార్ట్ స్టేడియం పూర్తి వివరాలు

ఈ హోబార్ట్ స్టేడియాన్ని 1914 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియం కెపాసిటీ కేవలం 15000 మాత్రమే. ఇందులో ఎక్కువ శాతం టెస్టులు నిర్వహిస్తారు. జనాలు తక్కువగా పడతారన్న సంగతి తెలిసిందే. అందుకే టెస్ట్లకు మాత్రమే ఈ స్టేడి అని వాడుతారు. 2009 సంవత్సరం నుంచి ఫ్లడ్ లైట్స్ ఇందులో ఏర్పాటు చేశారు. ఇక ఈ గ్రౌండ్ 175 మీటర్ల పొడవు… 135.5 వెడల్పు ఉంటుంది. ఇందులో ఎండ్ నేమ్స్ వచ్చేసరికి చర్చ్ స్ట్రీట్ ఎండ్ అలాగే రివర్ ఎండ్ ఉంటుంది.

ఇక ఈ పోస్టర్ చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. లార్డ్స్ లాంటి స్టేడియాలలో సెంచరీ చేస్తే కచ్చితంగా బోర్డు పైన రాస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ వికెట్లు తీసిన కూడా ఆ బౌలర్ పేరు బోర్డుపైన రాస్తారు. అలా రాస్తే అరుదైన గౌరవం దక్కినట్టు. ఇక.. ఇక్కడ కూడా మెట్ల పైన పేరు రాస్తే అరుదైన గౌరవం దక్కినట్లే అన్నమాట.

Related News

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

Jaiswal – Shreyas : ఆసియా కప్ 2025 కోసం టీమిండియా… శ్రేయాస్, జైశ్వాల్ కు నిరాశే !

Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

Big Stories

×