Rishabh Pant- Dele Alli: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే నాలుగు రోజులు పూర్తయింది. ఒకే ఒక్క రోజు పూర్తయితే మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనే దాని పైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఐదవ రోజు టీమిండియా బౌలర్లు చక్కగా బౌలింగ్ వేస్తే… గెలిచే ఛాన్స్ ఉంది. లేకపోతే వర్షం పడిందా మ్యాచ్ మాత్రం డ్రా అవుతుంది. అయితే ఇదంతా పక్కకు పెడితే… ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. మొదటి మ్యాచ్ లోనే రెండు వరుస సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.
Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
ఒకే టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన మొనగాడు పంత్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో రెండు వర్సెస్ సెంచరీలు చేశాడు రిషబ్ పంత్. ఇలా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్లలో… ఏడవ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో… 118 పరుగులు చేసి దుమ్ము లేపాడు రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టీమ్ ఇండియా ప్లేయర్ల తర్వాత.. ఏడవ ప్లేయర్గా రిషబ్ పంత్ నిలిచాడు. గతంలో పైన పేర్కొన్న ప్లేయర్లు కూడా ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు లిస్టులో ఉన్నారు.
సెంచరీ చేసిన తర్వాత పంత్ స్పెషల్ సెలబ్రేషన్స్.. దీని అర్థం ఏంటి?
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో రెండో సెంచరీ నమోదు చేసిన రిషబ్ పంత్.. చేసుకున్న సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత.. సర్కస్ చేసినట్లుగానే గాల్లో ఎగిరి దూకాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ నమోదు చేసిన తర్వాత స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రిషబ్ పంత్. సెంచరీ చేసిన తర్వాత చేతివేళ్లను రింగులాగా చేసి… కంటి వద్ద ఉంచి అందులోంచి చూసే ప్రయత్నం చేశాడు.
ఇలా చేయడాన్ని డెలీ అలీ ఐ సెలబ్రేషన్ అంటారు. అంటే ఓకే అని దీని అర్థం. ప్రముఖ ఫుడ్ బాల్ ప్లేయర్ డెలీ అలీ కూడా ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకునేవాడు. ఏడు సంవత్సరాల కిందట గోల్ చేసిన సందర్భంగా.. రిషబ్ పంత్ తరహాలో ఈ ఫుట్ బాల్ ప్లేయర్ అలీ చేయడం జరిగింది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు దాన్నే రిషబ్ పంత్ రిపీట్ చేసేసాడు. దీంతో రిషబ్ పంత్ చేసిన ఈ సెలబ్రేషన్స్ గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు.
Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?
Rishabh Pant bringing out the Dele Alli celebration pic.twitter.com/78kbVJLGhG
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) June 23, 2025