BigTV English

Rishabh Pant: 4 మ్యాచ్ ల్లో రిషబ్ పంత్ విఫలం..రూ. 27 కోట్లు దండగ.. లక్నో కు కొత్త కెప్టెన్ ?

Rishabh Pant: 4 మ్యాచ్ ల్లో రిషబ్ పంత్ విఫలం..రూ. 27 కోట్లు దండగ.. లక్నో కు కొత్త కెప్టెన్ ?

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్…రిషబ్ పంత్ పై ( Rishabh Pant) దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మెగా టోర్నమెంట్ లో… ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు ఈ ఆటగాడు రిషబ్ పంత్. మొన్న జరిగిన మెగా వేలంలో 27 కోట్లు పలికిన రిషబ్ పంత్… నాలుగు మ్యాచ్ లాడి ఆ మాత్రం పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో అందరూ రిషబ్ పంత్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. శుక్రవారం రోజున లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల… ఇవాళ మ్యాచ్ జరిగింది.


Also Read : Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ… ముంబైని నిండా ముంచేలా ఉన్నాడే..?

ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెంట్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే… ఈ మ్యాచ్ లో లక్నో ప్లేయర్లు బాగా ఆడుతున్నప్పటికీ… ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో కేవలం రెండంటే రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. ఆరు బంతులాడిన రిషబ్ పంత్… రెండు పరుగులు చేసి హార్దిక్ పాండ్యాకు వికెట్ సమర్పించుకున్నాడు.


Also Read : Venkatesh Iyer: 300 లేదు బొక్క లేదు… SRH పరువు తీసిన వెంకటేష్ అయ్యర్ ?

నాలుగు ఇన్నింగ్స్ లలో విఫలమైన రిషబ్ పంత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు లక్నో సూపర్ జెంట్స్ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడింది లక్నో సూపర్ జెంట్స్. ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడింది లక్నో. అయితే ఇందులో ఆరు బంతులు ఆడిన రిషబ్ పంత్ డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన తలపడింది లక్నో సూపర్ జెంట్స్. ఈ మ్యాచ్ లో అదృష్టం కొద్ది లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కానీ కీలక సమయంలో 15 బంతులు ఆడిన రిషబ్ పంత్ 15 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక.. ఆ తర్వాత మొన్న పంజాబ్ కింగ్స్ తో తలపడింది లక్నో. ఇందులో అయినా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి విఫలమయ్యాడు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. అటు శుక్రవారం జరిగిన ముంబై మ్యాచ్ లో కూడా రెండు పరుగులకే వెన్నుతిరిగాడు. ఇలా వరుసగా నాలుగు మ్యాచ్ లో విఫలమైన రిషబ్ పంత్ పై… లక్నో ఓనర్ సంజీవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది. త్వరలోనే లక్నో కెప్టెన్సీ కూడా మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రిషబ్ పంత్ స్థానంలో… పూరన్, మార్ష్ లలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×