E-Paper
Advertisement

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం
Advertisement

Robin Uthappa On Aussies behaviour: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ల పొగరు దిగిందని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఒళ్లంతా బలుపే ఉండేదని వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైందో.. అప్పటినుంచి బీసీసీఐ పవర్ ఆస్ట్రేలియా క్రికెటర్లకు అర్థమైంది అన్నారు. భారతదేశంలో కూడా విపరీతమైన డబ్బు ఉందని గ్రహించి… టీమిండియా క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా టీమిండియాను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గౌరవిస్తూనే ఉండని వ్యాఖ్యానించారు. దీని అంతటికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ల పై రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ల బలుపు తగ్గింది

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే అప్పట్లో ప్రత్యర్థులు గజగజ వనికి పోయేవారు. వాళ్లతో మ్యాచ్ జరిగితే.. వార్ వన్ సైడే. చాలాసార్లు టీమిండియా కూడా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటు వరల్డ్ కప్ టోఫీలు కూడా ఆస్ట్రేలియా వరుసగా గెలిచింది. ఈ క్రమంలో, టోర్నమెంట్ ఎక్కడ జరిగినా కూడా.. ఆస్ట్రేలియా క్రికెటర్లు కాస్త ఓవరాక్షన్ చేసేవాళ్ళు. ప్రత్యర్థి జట్టును చీప్ గా చూస్తూ… దగ్గరకు కూడా రానివ్వక పోయేవాళ్ళని ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని తాజాగా రాబిన్ ఉతప్ప వెల్లడించారు. 2008 కంటే ముందు.. ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఒళ్లంతా పొగరే ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులను మనుషుల కంటే హీనంగా చూసే వాళ్ళని బాంబు పేల్చాడు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… ఆస్ట్రేలియా క్రికెటర్ల దగ్గరకు కూడా ఇండియన్స్ ను రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. మేమే గొప్ప అన్న రేంజ్ లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ను వ్యవహరించారని ఆరోపణలు చేశారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

ఐపీఎల్ వచ్చిన తర్వాత మారిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు

2008 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత క్రమక్రమంగా భారతదేశమంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు గౌరవం పెరిగిందన్నారు. ఇక్కడ విపరీతంగా డబ్బులు సంపాదిస్తూ.. బీసీసీఐ తో పాటు టీమ్ ఇండియా ప్లేయర్లను జోకడం మొదలు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి పవర్ ఏంటో తెలుసుకున్న తర్వాత… టీమిండియా ప్లేయర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టారన్నారు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా హెడ్, స్టార్క్, పాట్ కమ్మిన్స్, మాక్సిమామ, స్మిత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బాగానే డబ్బులు సంపాదించారు. ఇప్పటికీ కొంతమంది ఐపిఎల్ లో కొనసాగుతూ ఉంటే… మరి కొంతమంది విదేశీ టోర్నమెంట్లకు కూడా వెళ్లిపోయారు. అదే సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో పలుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

Related News

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని టీమిండియా ఆడుతుంది..అందుకే ఈ సారి ఓడిస్తాం

మా పాకిస్తాన్ ప్లేయర్లు కోతుల కంటే దారుణం… వాటి కంటే ఎక్కువ అరటి పండ్లు మెక్కుతున్నారు !

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక

CSK కోచ్ గా జ‌హీర్ ఖాన్…ఆందోళ‌న‌లో ధోని ఫ్యాన్స్ ?

రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

నా బౌలింగ్ దెబ్బకు ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడు

Big Stories

Advertisement
×