Champions Trophy 2025: భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులలో ఓ రేంజ్ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య టోర్నీ ఎక్కడ జరిగినా..? వేదిక ఏదైనా..? స్టేడియాలు మాత్రం కిక్కిరిపోవాల్సిందే. గతంలో ఈ విషయం పలుసార్లు నిరూపితమైంది. ఇక ఈ రెండు జట్ల ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం మామూలుగా ఉండదు. ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. ఆ డేంజర్ ప్లేయర్ ఔట్?
అలా 2010 ఆసియా కప్ సందర్భంగా భారత స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ – పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ మధ్య జరిగిన గొడవను క్రీడాభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. భారత్ మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గ్రౌండ్ లో ఎంతో దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే బజ్జి బాడీ లాంగ్వేజ్ లో మార్పు కనిపిస్తుంది. 2010లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ – పాకిస్తాన్ మధ్య హోరాహోరీ పోరు సాగింది.
ఈ మ్యాచ్ లో హర్భజన్ చివరి ఓవర్ లో సిక్స్ కొట్టి భారత జట్టును గెలిపించాడు. అది కూడా షోయబ్ అక్తర్ బౌలింగ్ లోనే. దీంతో అక్తర్ రగిలిపోవడమే కాకుండా.. హర్భజన్ సింగ్ శరీరానికి గురిపెట్టి బౌన్సర్లు వేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తాజాగా ఇలాంటి ఘటనే షోయబ్ అక్తర్, హర్భజన్ సింగ్ మధ్య మరోసారి చోటు చేసుకుంది. వీరిద్దరూ ఒకరినొకరు నెట్టుకుంటూ బాహబాహికి దిగారు. కానీ ఇది సీరియస్ గా కాదు. కేవలం సరదా కోసమే.
తాజాగా ఇంటర్నేషనల్ లీగ్ టి-20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో వీరిద్దరూ ఇలా సరదాగా గడిపారు. అక్తర్ – బజ్జి సరదాగా గొడవపడిన వీడియోని.. షోయబ్ అక్తర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ” ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం మేము ఇలా సిద్ధం అవుతున్నాం” అని ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరి సరదా ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Also Read: Virat Kohli: షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ.. గుండెలపై చేయి వేసుకుని కుర్రాడు రచ్చ !
ఇక 2025 ఇంటర్నేషనల్ టి-20 టైటిల్ ని దుబాయ్ క్యాపిటల్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రోజు జరిగిన ఫైనల్ లో క్యాపిటల్ డెజర్ట్ వైపర్స్ ని నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది దుబాయ్ క్యాపిటల్స్. ఇక ఈనెల 19 నుండి దుబాయ్, పాకిస్తాన్ వేదికలలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025