BigTV English

Rohit Sharma Comments on Pitch: కాసేపట్లో పాక్‌తో హైఓల్టేజీ మ్యాచ్.. పిచ్, ఆటగాళ్లపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Sharma Comments on Pitch: కాసేపట్లో పాక్‌తో హైఓల్టేజీ మ్యాచ్.. పిచ్, ఆటగాళ్లపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Sharma Interesting Comments on Pitch: టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా పాకిస్తాన్, భారత్ మధ్య మరి కాసేపట్లో హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ వేదికగా నాసౌ కౌంట్రీ క్రికెట్ స్టేడియంలో భారత కాలమాన ప్రకారం.. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం యావత్తు ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. దాయాదుల మ్యాచ్ కావడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. కాగా, ఇప్పటికే ఐసీసీ సైతం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్, ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


పిచ్ అర్థం కావడం లేదు..

నాసౌ కౌంట్రీ క్రికెట్ స్టేడియం పిచ్‌పై వస్తున్న ఫిర్యాదులపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ పిచ్‌పై ఇప్పటివరకు రెండు మ్యాచ్ మాత్రమే ఆడామని, ఈ పిచ్ ఇంకా అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ సొంత మైదానం కాదని, అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందన్నారు. ఆడిన రెండు మ్యాచ్‌లతో పిచ్‌ను అంచనా వేయలేమని.. ఒక్కో రోజు పిచ్ ఒక్కోలా మారుతుందన్నారు. ఈ సమయం అర్థం చేసుకునేందుకు సరిపోదని, పిచ్ క్యురేటర్ సైతం అయోమయానికి గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ పిచ్‌పై ఆడతామో లేదో తెలియదని.. మెరుగైన ప్రదర్శన కనబర్చిన జట్టు మాత్రమే విజయం సాధిస్తుందని చెప్పారు. ఔట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉందని, ఎక్కువగా బౌన్స్ వస్తున్నాయని.. ఒక్కోసారి బంతి స్వభావం మారుతుందన్నారు. ఇలాంటి పిచ్‌లపై పరిగెత్తడం చాలా ముఖ్యమని, బంతి బౌన్స్ ఆధారంగా జాగ్రత్తగా ఆడాలన్నారు.


Also Read: ఇండియా -పాక్ మ్యాచ్.. ఇవీ జట్ల బలాబలాలు

అందరి సహకారం అవసరం

న్యూయార్క్ పిచ్‌లపై విజయం సాధించాలంటే జట్టులోని అందరి ఆటగాళ్ల సహకారం అవసరమని రోహిత్ పేర్కొన్నారు. మ్యాచ్ గెలిచేందుకు ఒకరు లేదా ఇద్దరిపై ఆధారపడడం సాధ్యం కాదని, 11మంది సహకారం అందించాలన్నారు. అయితే జట్టులో మ్యాచ్ విన్నర్స్ అందించే కీలక ఆటగాళ్లు ఉన్నారన్నారు. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే అందరి దృష్టి ఆటగాళ్లపై ఉంటుందని.. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకు కీలకం అవుతారని భావిస్తున్నట్లు రోహిత్ చెప్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అనుభవం జట్టుకు కీలమన్నారు. ఇప్పటివరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదుసార్లు తలపడగా.. భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×