BigTV English

Sehwag – Grey Divorce: ‘గ్రే’డివర్స్ అంటే ఏంటీ.. సెహ్వాగ్ తీసుకోబోయేది ఇలాంటి విడాకులేనా?

Sehwag – Grey Divorce: ‘గ్రే’డివర్స్ అంటే ఏంటీ.. సెహ్వాగ్ తీసుకోబోయేది ఇలాంటి విడాకులేనా?

Sehwag – Grey Divorce: టీమిండియా డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో వీరు క్రీజులో దిగాడంటే ప్రత్యర్థుల వెన్నుల్లో పణుకుపుట్టేది. ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రికార్డులను తిరగరాశాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే.. సెహ్వాగ్ కి 2004లో ఆర్తితో వివాహం జరిగింది. ఈ జంటకి ఇద్దరు కుమారులు ఆర్య వీర్, వేదాంత్ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా తండ్రి సెహ్వాగ్ బాటలోనే క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకున్నారు.


Also Read: Steve Smith: టెస్టుల్లో స్మిత్‌ 10 వేల పరుగులు..ఈ లిస్టులో ఉన్న ప్లేయర్లు వీళ్లే !

అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్ ని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరూ తమ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వైరల్ గా మారాయి. విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఈ జంట కూడా అలాగే చేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.


అంతేకాదు ఈ జంట చాలా నెలలుగా విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఏంటంటే..? సెహ్వాగ్ – ఆర్తి జంట “గ్రే డీవోర్స్” తీసుకోబోతున్నారట. గ్రే డివోర్స్ అంటే ఏమిటి..? అనే విషయంలోకి వెళితే.. గ్రే డివోర్స్ అంటే వృద్ధాప్యంలో విడాకులు తీసుకోవడం అని అర్థం.

సాధారణంగా నలభై ఏళ్ల తర్వాత జుట్టు రంగు మారిపోతుంది. అందుకే జుట్టుతో పోల్చే గ్రే డివోర్స్ అని పేరు పెట్టారు. దీనిని డైమండ్ విడాకులు అని కూడా అంటారు. గతంలో భారతదేశంలో ఈ గ్రే డివోర్స్ కి స్థానం లేదు. చాలాసార్లు ఆర్థిక పరిస్థితుల వల్ల 40 – 50 సంవత్సరాల మధ్య విడాకులకు దారి తీస్తాయి. డబ్బు లేకపోవడం, ఆర్థిక విషయాలలో అభిప్రాయ భేదాలు వీటికి దారి తీసే అవకాశం ఉంది. భారతదేశంలో గ్రే విడాకులు పొందిన సామాన్యుల సంఖ్య తక్కువ.

Also Read: Pandya- Jurel: పాండ్య బలుపే టీమిండియా కొంప ముంచిందా.. ఆ రన్‌ తీస్తే సరిపోయేది ?

కానీ సెలబ్రిటీల విషయంలో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి సెహ్వాగ్ – ఆర్తి చేరిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక సెహ్వాగ్ కెరీర్ విషయానికి వస్తే.. 1999లో టీమిండియాలో అరంగేట్రం చేసి 2013లో రిటైర్ అయ్యాడు. తన కెరీర్ లో సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టి-20 లు ఆడి.. మూడు ఫార్మాట్ లలో 17వేలకు పైగా పరుగులు చేశాడు. అంతేకాదు తన స్పిన్ బౌలింగ్ తో 136 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్ లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×