BigTV English

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, కాపాడాలంటూ ప్రభాకర్‌రావు పిటిషన్

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, కాపాడాలంటూ ప్రభాకర్‌రావు పిటిషన్

Telangana Phone Tapping:  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు. లేటెస్ట్‌గా ఆయన యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు, తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు దక్కించుకున్న ప్రభాకర్‌రావు, మరో అడుగు ముందు కేశారు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో కీలక సారాంశం ఏంటంటే.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పని చేశానని ప్రస్తావించారు. రాజకీయంగా తనను అక్కడి ప్రభుత్వం వేధిస్తుందని  పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని, ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటున్నానని రాసుకొచ్చారు.

ALSO READ: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ కారిడార్‌లో రోజుకు ఏకంగా అంతమంది ప్రయాణిస్తున్నారట!

ప్రభాకర్‌రావు దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. లేదంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందా? అనేది చూడాలి. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావుని ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్.

దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో మంతనాలు జరుపుతోంది. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Big Stories

×