Rajasthan Royals: ఐపీఎల్ 2025 సీజన్ లో 23వ మ్యాచ్ బుధవారం రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ని ఓడించింది గుజరాత్. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానం నుండి అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానం నుండి రెండవ స్థానానికి చేరింది.
ఈ సీజన్ లో వరుసగా నాలుగు విజయాలతో గుజరాత్ ఖాతాలో గరిష్టంగా 8 పాయింట్లు చేరాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ ఐదవ మ్యాచ్ లో మూడవ ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్ తో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అందరిపై భారీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు.
బుధవారం రోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణమే రాజస్థాన్ రాయల్స్ జరిమానాకి కారణం. నిర్ణీత సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ కీ పాల్పడడం ఇది రెండవసారి. ఈ మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఇదే జరిగింది. ఆ సమయంలో గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వచ్చిన రియాన్ పరాగ్ కి 12 లక్షల జరిమానా విధించారు.
ఇప్పుడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి స్లో ఓవర్ రేట్ కి పాల్పడడంతో.. రెండవసారి భారీ జరిమానా విధించారు. కెప్టెన్ సంజు శాంసన్ కి ఏకంగా 24 లక్షల ఫైన్, ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు తుది జట్టులోని మిగిలిన ప్లేయర్స్ కి కూడా 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజు లో 25% జరిమానా విధించనున్నట్లు ఐపీల్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Riyan parag: రియాన్ పరాగ్ ఔట్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందా
ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో.. మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. గుజరాత్ – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ విజయాల పరంపరకు అహ్మదాబాద్ లో బ్రేక్ పడింది.