Kho Kho World Cup final: స్వదేశంలో జరుగుతున్న మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్ కి దూసుకు వెళ్ళాయి. దేశీయ క్రీడల్లో దుమ్ము రేపుతున్న మన జట్లు క్వార్టర్స్ లో అదే ఆధిపత్యాన్ని కనబరిచాయి. భారత మహిళల, పురుషుల జట్లు ఈ మెగా టోర్నిలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా తిరుగులేని టీమ్స్ గా కొనసాగుతున్నాయి.
Also Read: Sanju Samson- BCCI: సంజూ శాంసన్ కి బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు!
శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు ఖో ఖో ప్రపంచకప్ 2025 ఫైనల్ కీ చేరుకుంది. భారత టీమ్ 66 – 16 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాని చిత్తు చేసింది. మొదటి టర్న్ లో డిఫెండింగ్ క్యూ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దక్షిణాఫ్రికా కీలక పాయింట్లు సాధించింది. స్కోర్ 10-5 తో ఐదు పాయింట్ల ఆదిత్యంలో దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక రెండోవ టర్న్ లో అటాకింగ్ చేసిన భారత మహిళా జట్టు మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 33-10 తో 23 పాయింట్ల అధిక్యంలోకి వచ్చింది.
మూడవ టర్న్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మరో ఆరు పాయింట్లను సాధించి 16 పాయింట్లకు చేరింది. ఇక చివరి టర్న్ లో భారత్ మరోసారి అటాక్ చేసి 66 – 16 తో 50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఫైనల్ కీ చేరుకుంది. ప్రియాంక ఇంగ్లే కెప్టెన్సీలోని భారత మహిళా జట్టు ఆదివారం జరిగే ఫైనల్ లో నేపాల్ మహిళలతో తలపడతారు.
భారత మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో సహ వరుసగా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది. ఇక మరో మ్యాచ్ లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి టర్న్ లో దక్షిణాఫ్రికా పై అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్ లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఓ దశలో భారత్ కి షాక్ ఇచ్చేలా కనిపించింది.
Also Read: Rinku Singh: రూ.500 నోట్లు పంచుతున్న రింకూ సింగ్.. కారణం ఆ అమ్మాయేనా?
నాలుగో టర్న్ లో కుదురుకున్న మనోళ్లు దక్షిణాఫ్రికా కి చెక్ పెట్టారు. హోరాహోరీగా సాగిన ఈ పురుషుల పోరులో భారత్ 62 – 42 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించారు. ఇక ఫైనల్ లో నేపాల్ తో భారత పురుషులు తలబడతారు. రెండవ సెమీస్ లో నేపాల్ 72-20 పాయింట్ల తేడాతో ఇరాన్ ని ఓడించింది. దీంతో నేపాల్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్స్ లో ఇరు జట్లు నేపాల్ తోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి.
INDIAN MEN’S & WOMEN’S KHO KHO TEAM REACHED FINAL
Women’s Team defeated 🇿🇦 66-16 to reach the Final of the ongoing Kho Kho World Cup.
Men’s Team beat 🇿🇦 60-42 to reach the Final.
Both teams will face 🇳🇵in the Final for the title.pic.twitter.com/e2jbFdutkZ
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) January 18, 2025