Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వరల్డ్ క్రికెట్ లో వేసిన ముద్ర ఎలాంటిదో ప్రతీ క్రికెట్ అభిమానికి తప్పకుండా తెలుసు. క్రికెట్ గాడ్ అనే ట్యాగ్ సచిన్ టెండూల్కర్ కి ఇచ్చారంటే అతను ఎన్ని ఘనతలు సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ క్రికెట్ లో దాదాపు సగం బ్యాటింగ్ రికార్డ్స్ సచిన్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్ లో తన సేవలను అందించిన సచిన్ కి ఏకంగా భారత రత్న అవార్డు లభించింది. అంతేకాదు.. క్రికెట్ చేసిన సేవలకు గాను బీసీసీఐ “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్” అవార్డు వరించింది. ఇంత ఖ్యాతి సాధించిన సచిన్ టెండూల్కర్ కి సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో
అభిమాని కోసం సచిన్ ఏం చేశాడంటే..?
సచిన్ కారులో వెళ్తుంటే.. తన అభిమాని సచిన్ ను చూసి స్కూటీని ఆపాడు. సచిన్ కారును కూడా ఆపి అభిమానితో కొద్ది సేపు మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సచిన్ అభిమాని సచిన్ టెండూల్కర్ కి రెండు చేతులు జోడింగ్ నమస్కారం చేశారు. మిమ్మల్ని కలవడం గొప్ప విషయం అని సచిన్ తో పేర్కొన్నాడు. అనంతరం సచిన్ టెండూల్కర్ తో ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే.. ముంబై కి సమీపంలో సచిన్ సతీమణి అంజలీ టెండూల్కర్ ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకు ఆమె రూ.32 లక్షలు చెల్లించినట్టు సమాచారం. ఈ ప్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. గత ఏడాది మే 30న అంజలి ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె రూ.1.92 లక్షలు మేర స్టాంప్ డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30వేలు చెల్లించినట్టు జాప్ కీ.కామ్ వెల్లడించింది.
సచిన్ ఆస్తి ఎంతంటే..?
మహిళలు ప్లాట్లు కొనుగోలు చేస్తే.. స్టాంప్ డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. అంతేకాదు..మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది. టీమిండియా క్రికెటర్ గా కొనసాగిన సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్ లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. ఆ రేంజ్ లోనూ సంపదను కూడా పోగేసుకున్నాడు. ఓవైపు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్ గా వార్షిక జీతం, మ్యాచ్ ఫీజులు, మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, సదరు బ్రాండ్లకు వ్యాపార భాగస్వామిగా ఉండటంతో రెండు చేతులా సంపాదించాడు సచిన్. ఆటకు వీడ్కోలు పలికి దాదాపు 12ఏళ్లు కావస్తున్నా.. సచిన్ సంపాదన మాత్రం పెరుగుతూనే ఉంది. సచిన్ నిరక ఆస్తుల విలువ రూ.1250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
?igsh=Z2gwcHFxcGlpYjBx