Jasprit Bumrah Revenge On Sahibzada Farhan: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 final) ఫైనల్స్ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ సేన, విక్టరీ అందుకుంది. అయితే…ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో 6 బంతులకు 6 సిక్సర్లు కొడతానని విర్రవీగిన కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు. బుమ్రా వేసిన ఓ బౌన్సర్ ను సిక్సర్ గా మలిచే ప్రయత్నం చేశాడు.
కానీ వేగంగా బంతి దూసుకురావడంతో ఫర్హాన్ చేతులెత్తేశాడు. ఈ క్రమంలో ఫర్హాన్ ముఖానికి బంతి బలంగానే తాకింది. దీంతో బ్యాట్ నేలకేసి కొట్టి.. దూరంగా నడిచాడు. ఆ తర్వాత బ్యాట్ తీసుకుని, స్ట్రైకింగ్ లోకి వచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియోను చూసిన బుమ్రా ఫ్యాన్స్, టీమిండియా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టి, డాక్యూమెంటరీ తీస్తానన్న వెధవకు తగిన పనిష్మెంట్ జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి బుమ్రా జోలికి వస్తే, పిచ్ లోనే పాతేస్తామని హెచ్చరిస్తున్నారు. అన్ని మూసుకుని పాకిస్తాన్ వెళ్లిపోరా అంటూ ఆగ్రహిస్తున్నారు.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) ఆసియా కప్ 2025 సందర్భంగా బుమ్రాను ఆడుకున్నాడు. అతని బౌలింగ్ లో వరుసగా సిక్సర్లు బాదాడు. ఈ తరుణంలోనే ఏ రోజుకైనా బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతానని సాహిబ్‌జాదా ఫర్హాన్ అప్పట్లో ప్రకటించాడు. బుమ్రా బౌలింగ్ లో సిక్సులు కొట్టి, డాక్యూమెంటరీ కూడా తీస్తానని సినిమా రేంజ్ లో ఓవరాక్షన్ చేశారు. అయితే, తాజాగా జరిగిన ఫైనల్స్ సందర్భంగా మాత్రం బుమ్రా బౌలింగ్ ఎదుర్కొనేందుకు చాలా భయపడ్డాడు ఫర్హాన్. అతడు వేసిన బౌన్సర్ ను ఎదుర్కొలేక మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు. అంతేకాదు ఈ ఫైనల్స్ లో కేవలం 10 పరుగులే సాధించిన ఫర్హాన్, ఒక్క సిక్సర్ కూడా సాధించలేకపోయాడు. దీంతో ఫర్హాన్ పై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఏషియన్స్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో అద్భుతంగా రాణించి, పాకిస్తాన్ ను 19 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది టీమిండియా. హసన్ నవాజ్ ఒంటరి పోరాటం చేసినా, టీమిండియానే గెలిచి.. గోల్డ్ మెడల్ దక్కించుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
Big Big Fight Between Sahibzada Farhan vs Jaspirt Bumrah 🥵🥶
pic.twitter.com/dj3gLgy6qS— Usman (@Usman_56Offical) October 3, 2026