E-Paper
Advertisement

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్
Advertisement

Korean Romantic Series: 18 ఏళ్లుగా శత్రుత్వం కొనసాగిస్తున్న రెండు కుటుంబాలు ఉంటాయి. కానీ అవే కుటుంబాల్లో పుట్టిన ఇద్దరు మాత్రం చిన్నప్పుడే ప్రేమలో పడితే ? ఒకరినొకరు చూసిన ప్రతిసారీ గొడవపడే స్థాయి నుంచి… ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే స్థాయికి వాళ్ల బంధం ఎలా వచ్చింది ? ఆ ప్రేమను కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఎలా విడదీశాయి ? ఏళ్ల తర్వాత మళ్లీ ఎదురుపడినప్పుడు పాత ప్రేమ మళ్లీ చిగురిస్తే పరిస్థితి ఎలా మారుతుంది ? ఇలాంటి ఆసక్తికరమైన ప్రేమకథతో వచ్చిన కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘లవ్ యువర్ ఎనిమీ’ (Love Your Enemy).

కథలోకి వెళ్తే…

సియోక్ జీ-వోన్, యూన్ జీ-వోన్ ఇద్దరూ ఒకే రోజు పుట్టారు. అంతేకాదు… ఇద్దరి పేర్లూ కూడా ఒకటే. కానీ ఈ ఇద్దరి కుటుంబాల మధ్య మాత్రం తరతరాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆ కుటుంబ శత్రుత్వం ప్రభావం వీళ్లపై పడుతుంది. ఒకరిని ఒకరు ప్రత్యర్థులుగానే చూసుకుంటూ పెరుగుతారు. అయితే వయసు పెరిగేకొద్దీ పరిస్థితి మారుతుంది. ఎప్పుడూ గొడవపడే ఈ ఇద్దరి మధ్యే ప్రేమ మొదలవుతుంది. కుటుంబాలకు తెలియకుండా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ వాళ్ల ప్రేమకు పాత కక్షలు, కుటుంబాల మధ్య ఉన్న గొడవలు అడ్డుగా నిలుస్తాయి.

Advertisement

చివరకు అపార్థాలు పెరిగి ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. 18 ఏళ్ల వయసులో ముగిసిపోయిన ఆ ప్రేమ.. ఇద్దరి జీవితాల్లోనూ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కథ అక్కడితో ఆగిపోదు. 18 ఏళ్ల తర్వాత సియోక్ జీ-వోన్, యూన్ జీ-వోన్ మళ్లీ ఒకే చోట ఎదురుపడతారు. అప్పటికి ఇద్దరి వయసు 36 ఏళ్లు. సియోక్ జీ-వోన్ అదే పాఠశాలకు కొత్త చైర్మన్‌ గా వస్తే… యూన్ జీ-వోన్ అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ గా పని చేస్తుంటుంది. ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్నా… గతం పూర్తిగా మరిచిపోలేదు. దీంతో పాత శత్రుత్వం మరోసారి బయటపడుతుంది.

ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తినే ఇప్పుడు ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితి రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. చిన్న విషయాలకే మాటామాటా పెరుగుతుంది. అయితే ఆ కోపం వెనుక దాచుకున్న భావాలు మాత్రం అంత సులభంగా మాయమైపోవు. గతంలో ఏం జరిగిందనే విషయంలో ఇద్దరికీ వేర్వేరు జ్ఞాపకాలు, అభిప్రాయాలు ఉండటంతో అపార్థాలు కూడా మళ్లీ తెరపైకి వస్తాయి. ఈ క్రమంలో పాత ప్రేమ నెమ్మదిగా మళ్లీ బయటపడుతుంది. 18 ఏళ్ల క్రితం విడిపోయిన జీ-వోన్, జీ-వోన్ మళ్లీ ఒక్కటవుతారా ? కుటుంబాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైరం వాళ్ల ప్రేమకు మరోసారి అడ్డుగా నిలుస్తుందా ? గతంలో వాళ్లను విడదీసిన అపార్థం ఏంటి ? ఈసారి కుటుంబాల మాట వింటారా… లేక తమ మనసు చెప్పినట్టే నడుస్తారా ? అన్నదే సిరీస్‌ లో ఆసక్తిని పెంచే అంశం.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

Advertisement

జూ జీ-హూన్ (Ju Ji-hoon), జంగ్ యూ-మి (Jung Yu-mi), లీ సీ-వూ (Lee Si-woo) ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ యువర్ ఎనిమీ’ 12 ఎపిసోడ్ల కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్. పార్క్ జూన్-హ్వా (Park Joon-hwa) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2024లో టీవీఎన్‌లో ప్రసారమైంది. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఉంది.

Read Also: డేటింగ్ యాప్ ఫౌండర్ కు డేరింగ్ ఛాలెంజ్… ఓటీటీలోకి తెలుగులో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ సిరీస్

Related News

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

జైలు నుంచి వచ్చిందే తమ్ముడి బెండ్ తీయడానికి.. రిహాబ్‌లో అన్నదమ్ముల మాస్ హంగామా… ఓటీటీలోకి ఇంటెన్స్ డ్రామా

24 ఏళ్లకే తండ్రి బాధ్యతలు తలపై పడితే… డైలీ సీరియల్ లెవెల్ గందరగోళం… క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పాడుబడిన పిచ్చాసుపత్రిలో సెక్యూరిటీ మిస్సింగ్… తీరా చూస్తే స్పైన్ చిల్లింగ్ విజువల్స్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ… గుండె జారిపోయే అడ్వెంచర్

కోడలు రాకతో అత్తింట్లో మొదలయ్యే చావుల పరంపర… ఓటీటీలోకి డెడ్లీ హారర్ మూవీ

స్వేచ్ఛ కోసం జూ యానిమల్స్ చేసిన సాహసం… ఫన్నీ జంగిల్ జాతర

Big Stories

Advertisement
×